జాక్సన్ పర్సనల్ చెఫ్ గా ఇండియన్: పంజాబీ రుచులతో దగ్గరైన నలభీముడు!

కింగ్ ఆఫ్ పాప్ గా… పాప్ సంగీత సామ్రాజ్యాన్ని ఉర్రూతలూగించిన 20వ శతాబ్దపు దిగ్గజం మైఖేల్ జాక్సన్. అందుకే, తాను వెళ్లిపోయినా వార్తల్లోని వ్యక్తే. ఈ మధ్యే మైఖేల్ జాక్సన్ అల్లుడు జాఫర్ జాక్సన్ మామ పాత్రలో బయోపిక్ లోో నటించడంతో జాక్సన్ ను మళ్లీ అంతా గుర్తు తెచ్చుకుంటున్నారు. అయితే, అంతటి ఘనత సాధించిన మైఖేల్ జాక్సన్ కు బోలెడన్ని శాకాహార వంటకాలను పరిచయం చేసింది మాత్రం మన ఇండియన్ చెఫ్. ఈ సంగతి తెలుసా..?

పాప్ ప్రపంచ మహరాజుగా ప్రసిద్ధి పొందిన ఆయన వివిధ దేశాల వంటకాలను రుచి చూసేందుకు ఆయన దగ్గర ఆయా దేశాలకు చెందిన చెఫ్స్ ఉండేవారు. ఆయన పర్యటనల్లో ఆయన డైట్ గురించి వారిదే ప్రధాన పాత్ర. ఆ క్రమంలో మైఖేల్ జాక్సన్ కు ఆరోగ్యరిత్యా పాటించాల్సిన డైట్ విషయంలో శాకాహార వంటకాల అవసరమేర్పడింది. ఆ సమయంలోనే భారతీయ శాకాహార రుచులను వండిపెట్టేందుకు మన పంజాబీ సిక్కు నలభీముడొకడు మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత చెఫ్ గా నియామకమయ్యారు.

1982-85 సమయంలో పాప్ కింగ్ గా మైఖేల్ జాక్సన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న సమయంలో ఆయన తన వ్యక్తిగత చెఫ్ గా మణి నియాల్ సింగ్ ఖల్సాను నియమించుకున్నాడు. ఆ సమయంలో ప్రతీ పర్యటనలోనూ మణి నియాల్ సింగ్ ఖల్సా మైఖేల్ జాక్సన్ వెంట ఉండి తీరాల్సిందే. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో స్వీట్ బార్ బేకరీ యజమాని అయిన నియాల్.. జాక్సన్ ఆహార అవసరాలు, ఆయన అభిరుచులకు తగ్గట్టుగా.. అలాగే, ఆరోగ్యకరమైన న్యూట్రీషన్ ఫుడ్ అందించేవాడు.

మణి సింగ్ ఖల్సా కేవలం చెఫ్ గా మాత్రమే కాదు. మైఖేల్ అభిరుచులు, అవసరాలు అర్థం చేసుకున్న వ్యక్తి. మైఖేల్ జాక్సన్ తన కెరీర్‌ పీక్ లో ఉన్నప్పుడు పనిలో కుదిరాడు ఖల్సా. తన సూపర్ హిట్ ఆల్బమ్ థ్రిల్లర్ విడుదల సమయంలో జాక్సన్ పెద్దగా కూరగాయలు ఇష్టపడేవాడు కాదు. కానీ, మైఖేల్ ఆరోగ్య పరిస్థితి దృష్యా డైట్ ప్లానింగ్ లో భాగంగా శాకాహారం తినాల్సి వచ్చింది. దాన్ని చూసుకోవడం మణి పని. ఓసారి పీపుల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెఫ్ మణి తన అనుభవాలను పంచుకున్నాడు. పాప్ ప్రపంచంలో ఒక ఉప్పెనను స్వయానా దగ్గరుండి చూసే అవకాశం తనకు దక్కిందని.. అదే సమయంలో, జాక్సన్ ఆంతరంగిక వ్యవహారాలనూ కూడా చూసే అవకాశమూ దక్కిందని ఖల్సా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

మైఖేల్ జాక్సన్ కు వంట చేయడం అంత సులభం కాదు. ఆయన చాలా పరిమితమైన రుచులను మాత్రమే ఇష్టపడేవాడు. చాలావరకూ అతడికి రుచించకపోయేవనీ వెల్లడించాడు. శాఖాహారైనప్పటికీ చాలా కూరగాయలను ఇష్టపడేవాడు కాదు. పిజ్జాను ఇష్టపడే జాక్సన్.. పాస్తాను ఇష్టపడేవాడు కాదు. స్వీట్స్ అంటే ఇష్టమున్నప్పటికీ.. చక్కెర, చాక్లెట్స్ నూ ఇష్టపడేవాడు కాదు. అలాంటి సమయంలో తనకెలాంటి ఆహారమందించాలన్నది చాలా కష్టంగా ఉండేదంటాడు మణి. ఒక పాప్ ఐకాన్‌కు ఆరోగ్యకరమైన సంరక్షణనందించే క్రమంలో తను చాలా సవాళ్లనే ఎదుర్కోవాల్సి వచ్చిందంటాడు ఖల్సా.

చాలావాటిని ఇష్టపడకపోవడంతో మైఖేల్ జాక్సన్ కు ఏం వండటమనేది చాలాసార్లు మణికి ఓ పజిల్ గా మారేది. స్మోక్డ్ స్పైసీ రెడ్ చిల్లీ ఎన్చిలాడాస్ అనే మెక్సికన్ వెరైటీని జాక్సన్ ఎక్కువగా ఇష్టపడేవాడట. సాలడ్స్, మొరాకో సాస్ తో కలిపి వివిధ రకాల ఫ్రైడ్ చేసిన కూరగాయల ముక్కల టోఫు షిప్ కబాబ్స్ ఇష్టపడేవాడట జాక్సన్. తరచూ రిహాల్సల్స్ సమయంలో మైఖేల్ జాక్సన్ భోజనం చేసేవాడు కాదని.. ఆ తర్వాత మాత్రం ఆకలితో అలమటించేవాడంటాడు ఖల్సా. కాబట్టి, తన ఆకలికి, రుచికి తగ్గ ఆహారాన్ని అందించి జాక్సన్ ను సంతృప్తిపర్చేవాణ్నంటాడు.

సూపర్ స్టార్స్ కొందరే కావచ్చుగానీ.. వారి వెనుకా కొందరు అన్ సంగ్ హీరోస్ ఉంటారు. వారి జిమ్ ట్రైనర్స్ కావచ్చు, చెఫ్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు. వీరంతా ఆ తారల ప్రకాశానికి వెనుకనున్న ఇంధనంలాంటివారు. అలాంటి వ్యక్తే మణి. జాక్సన్ తో మణి గడిపిన సమయం.. ఆయన ఉద్యోగాన్ని మించింది. ఏకంగా వరల్డ్ పాప్ స్టార్ తో కలిసి పర్యటించేందుకు ఎందరికో దక్కని.. మణికి మాత్రమే దక్కిన ఓ గొప్ప అవకాశం. అంతేకాదు, మణిసింగ్ ఖల్సా జీవితంలో జాక్సన్ తో ప్రయాణం ఓ మరపురాని అధ్యాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles