కొంచెం ఆత్మస్థైర్యం ఇవ్వండి.. మీ పిల్లలు కుమ్మేస్తారు: ఆకట్టుకునే ఓ వార్త ఇది!

అసలు సిసలు వార్తంటే… ఇదీ!

…………………………………….

Ramu Suravajjula… ✍🏼

కొద్దిగ విజ్ఞానం ఇచ్చి, ఆడుతూ పాడుతూ పెరగాల్సిన సమయం మొత్తాన్ని గుండుగుత్తగా హరించేది చదువు. పిల్లల్లో ఉండే సృజనాత్మకతను చాలా వరకు చిదిమేసి, అభిరుచి అన్న దానికి విలువలేకుండా, మూస ధోరణిలో ఆలోచించేలా చేసేది నవీన విద్యా వ్యవస్థ. పరీక్షలు ఒక ర్యాట్ రేస్. పరీక్షల్లో క్లాసులు, గ్రేడ్లు, ర్యాంకులు ఒక బూటకపు కొలబద్దలు. చదువే ప్రపంచంగా చేసుకుని ఫస్ట్ క్లాస్ లో పాసైన బ్రిలియంట్ స్టూడెంట్ కన్నా ఆటలూ పాటల్లో పాల్గొంటూ ఏవరేజ్ మార్కులతో పాసై లోకజ్ఞానం ఉన్న స్టూడెంట్ మెరుగైన మనిషి అని నాకు నమ్మకం. డబ్బుతో మొదటి కేటగిరీ వాడు, ఆనందంతో రెండో కేటగిరీ వాడు బతికేస్తారు. నా కళ్ళ ముందు దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.

స్కూలు స్థాయిలో ఒకరిద్దరు పిచ్చి టీచర్లు చాలు…ఆత్మవిశ్వాసం దెబ్బతీసి, చచ్చుపడేలా చేయడానికి. ఈ చదువు అనే పీడ లేకుండా ఉండేలా తొందర తొందరగా పెద్దయి పోవాలని స్కూల్లో ఉన్నప్పుడు తపించేవాడిని. అందరిలా బుద్ధిగా చదివి క్లాస్ ఫస్ట్ వచ్చే నా ఆత్మవిశ్వాసాన్ని ఒక ఇద్దరు, ముగ్గురు పంతుళ్లు బుగ్గి బుగ్గి చేసి చదువు మీద ఏహ్యభావం పెంచారు. అది వేరే సంగతి.

విద్య వ్యాపారమయ్యాక చదువు లో మజా లేకుండా పోయింది. పుట్టగానే ఐ ఐ టీ, మెడిసిన్ కోచింగ్ మొదలయ్యే! ఈ అవలక్షణం అట్లా ఏడిస్తే…చదువులో ఫెయిల్యూర్/ వైఫల్యం అన్న పదాలే పెద్ద తప్పు. ఎవడో 35 అన్న దాన్ని స్థిరీకరించి పాస్, ఫెయిల్ అని సూత్రీకరించి జీవితాలతో ఆడుకుంటున్నాడు. మా చిన్నపుడు 50 శాతం రావడం గగనమయ్యేది. ఇప్పుడు 95 శాతం పైన రానివాడు బడ్డు అన్నట్టు. 35 కు తక్కువ వేస్తే ఎందుకూ పనికిరాని వేస్ట్ ఫెలో అన్న భావం పెంచి పిల్లలని కుంగ దీసి పారేస్తున్నాం. సమాజం సృష్టించిన హైప్, గ్రేడింగ్ మూలంగా సున్నిత మనస్కులైన చిన్నారులు ఇక్కడ మనం బతకలేం…అని ఉసురు తీసుకుంటున్నారు.

పరీక్షలకు సంబంధించిన తిక్క లెక్కకు భిన్నంగా, పదో తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ ఆయన కొడుకు ను అంతా అవమాన పరుస్తుంటే ఖుషీ చేయడం కోసం కేక్ కట్ చేసిన తల్లి దండ్రులు నాకు గ్రేట్ అనిపించారు. సూపర్ వార్త ఇది. ధైర్యం, ఆత్మ స్థైర్యం ఇవ్వండి సార్, పిల్లలు కుమ్మేస్తారు.
అవునూ….ఈ పేరెంట్స్ చేసిన దానికి మీకు ఏమనిపిస్తోంది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles