కోట్లమందిలో కొందరి దగ్గరే 18 శాతం సంపద! ఇదీ భారత్ ఆర్థికస్థితి!!

ఆర్థిక అసనమానతలు తగ్గాలనే ఊకదంపుడు ఉపన్యాసాలెలాగూ ఉండనే ఉంటాయి. కానీ, అది తగ్గేదిలేకపోగా భారతదేశంలో ఆర్థిక తారతమ్యాలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒకసారి ధనవంతుల జాబితా చూస్తే దిమ్మతిరిగిపోతుంది. అంతేకాదు భారత్ లో 18 శాతం సంపదంతా కేవలం 2 వేల కుటుంబాలు మాత్రమే నియంత్రిస్తున్నాయంటే మీరు నమ్మగలరా..? కానీ, అదే నిజం.

ఈ విషయాన్ని ఇటీవలే బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శంతన్ దేశ్ పాండే లింక్డ్ ఇన్ పోస్ట్ లో పేర్కొన్నారు. తద్వారా భారతదేశ ఆర్థిక నిర్మాణంలో ఉన్న అసమానతలను సమాజం దృష్టికి తీసుకొచ్చే యత్నం చేశారాయన. 18 శాతం సంపదంతా చేతుల్లో పెట్టుకున్న ఆ రెండు వేల కుటుంబాలు కూడా పన్నుల రూపంలో చెల్లిస్తున్న వాటా కేవలం 1.8 శాతమేనని.. ఇదొక మతిపోగొట్టే విషయంగా ఆయన అభివర్ణించారు.

భారత్ లో ఒక పది సంపన్న కుటుంబాలు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాలు చూస్తే ఔరా అనిపించేవి. వారు దేశ ఆర్థికవృద్ధికి కారకులా.. లేక, పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు ప్రతీకలా అన్నదీ ఓ పెద్ద చర్చే. ఎందుకంటే టెక్నాలజీ, ఇంధనం, ఔషధాలు, వినియోగ వస్తువులు ఇలాంటి పరిశ్రమలను నిర్వహించేవారే భారత్ లోని టాప్ టెన్ జాబితాలో కనిపిస్తున్నవారున్నారు. వారి వల్ల ఉపాధి కల్పన జరగడంతో పాటు, ఉత్పాదకతలోనూ, ఆర్థికంగానూ భారత్ ఎదగడంలో ఆయా వ్యాపారవేత్తల పాత్ర కీలకం. అంతేకాదు, ప్రపంచ వ్యాపారవేదికపై భారత్ కు స్థానం కల్పించడంలోనూ, బహుళజాతి కంపెనీలతో భాగస్వామ్యాలను నడపడంలోనూ, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆవిష్కరణల్లోనూ వారి భాగస్వామ్యం.. వారందించే సంపద నిస్సందేహంగా భారత్ కు బాసటే.

అలాంటి కుటుంబాల్లో మనం కొన్ని గమనిస్తే ముఖేష్ అంబానీ గ్రూప్, అదానీ గ్రూప్ నంబర్ వన్, టూ పొజిషన్స్ లో కనిపిస్తుంటే… బిర్లాలు, నాడార్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యం 95.4 బిలియన్ డాలర్స్ నికర విలువతో దేశ ఆర్థికరంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో అదానీ గ్రూప్ దే పైచేయి. ఇంధనం, మౌలిక సదుపాయల కల్పనలో ఈ రెండు గ్రూప్స్ ఇంకే పారిశ్రామికవేత్తలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఆ తర్వాత భారతదేశ పారిశ్రామికాభివృద్ధిలో బిర్లాలు, నాడారా పాత్ర దశాబ్దాల కాలం నుంచీ కొనసాగుతోంది.

ఈ క్రమంలో 2025 లో ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిన పదిమంది భారతీయ పారిశ్రామికవేత్తల జాబితాపై ఓసారి లుక్కేయండి.

1) ముఖేష్ అంబానీ- రిలయన్స్ ఇండస్ట్రీస్- 95.4 మిలియన్ డాలర్స్- 67 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 18వ స్థానం.
2) గౌతమ్ అదానీ- అదానీ గ్రూప్- 62.3 బిలియన్ డాలర్స్- 62 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 25వ స్థానం
3) శివ్ నాడార్- హెచ్సీఎల్- 42.1 బిలియన్ డాలర్స్- 79 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 37వ స్థానం
4) సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ- ఓ.పీ. జిందాల్ గ్రూప్- 38-5 బిలియన్ డాలర్స్- 74 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 41వ స్థానం
5) దిలీప్ షాంఘ్వీ- సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్- 29.8 బిలియన్ డాలర్స్- 69 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 59వ స్థానం
6) సైరస్ పూనావాలా- సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా- 22.2 బిలియన్ డాలర్స్- 83ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 89వ స్థానం
7) కుమార మంగళం బిర్లా- ఆదిత్య బిర్లా గ్రూప్- 21.4 బిలియన్ డాలర్స్- 57 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 92వ స్థానం
8) కుశాల్ పాల్ సింగ్- డీఎల్ఎఫ్ లిమిటెడ్- 18.1 బిలియన్ డాలర్స్- 93 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 106వ స్థానం
9) రవి జైపురియా- వరుణ్ బేవరేజెస్- 17.9 బిలియన్ డాలర్స్- 70 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 108వ స్థానం
10) రాధాకిషన్ దమాని- డీమార్ట్- $15.8 బిలియన్ డాలర్స్- 70 ఏళ్ల వయస్సు- వరల్డ్ ర్యాంక్ 129వ స్థానం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles