Padmaja Suraparaju…
“Love! who made her!” అంటాడు భర్త భార్యతో తమ కూతురి వైపు చూస్తూ.
‘‘Did he who made the lamb make thee?” అన్న Blake వాక్యం లోని అద్భుతాశ్చర్యం లేదు, ‘Adolescence’ లో తండ్రి వాక్యంలో.

‘‘మనకు భోజనం టేబిల్ నేను సెట్ చేస్తానులే ఇవాళ‘‘ అంటూ బుద్ధిగా వెళుతున్న కూతురి వైపు చూస్తూ అంటాడతను ఆ పిల్ల తల్లితో. ఆరోజు అతని పుట్టినరోజు.
హత్యానేరం మీద పోలీస్ డిటెన్షన్ లో ఉన్న కొడుకు పదినిమిషాల క్రితం ఫోన్ చేసి తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ‘‘నాన్నా నేను నేరం ఒప్పుకోబోతున్నాను‘‘ అని చెప్పిందాకా వాడి అమ్మా నాన్నా అక్క లకు కాస్త ఆశ ఉండింది ఈ హత్య వాడు చేసి ఉండడు అని. ఆ పిల్లవాడినీ ఈ పిల్లనూ కన్నదీ పెంచిందీ ఇదే అమ్మా నాన్న మరి!
తండ్రికి దాదాపూ నిజం తెలుసు, అతను కొడుక్కి ఏ శిక్ష పడుతుందో అనేదాని కంటే వీడు హత్య చేసేంత దిగజారాడా అనే శోకం, అది నిజం కాకపోతే బావుండు అన్న ఆశతో ఉన్నట్టే ఉంటాడు.
ఈ సీరిస్ స్క్రీన్ ప్లే, చక్కటి performances, ఒక ఎపిసోడ్ మొత్తం ఒకటే లాంగ్ షాట్, అలా ఏదో తీసి అందరికీ (అమ్మా నాన్నలు, అంతకంటే పెద్దవాళ్ళు) కు చాలా నచ్చింది కానీ అదే వయసు పిల్లలను కూచోబెట్టి షో వేస్తే ఏ దేశంలో పిల్లలు కూడా పది నిమిషాలకంటే చూడలేరు, కనీసం తాము ఆ సినిమా చూడటం పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నారని తెలిస్తే.
అలా చూపించి వాళ్ళ ముఖంలో భావాలు కనిపెట్టి పిల్లలను ఏదో సరిదిద్దాలని శిక్షలేయాలనో కాదు, మనం యేమీ హామ్లెట్ కాదు, నాటకంతో నిజాలు రాబట్టడానికి.
ఇది ఇంటర్నెట్ వచ్చినప్పటినుంచీ ప్రపంచంలో జరుగుతున్న రెగ్యులర్ గోల, కాకపోతే కొన్నేళ్ళ క్రితం కాలేజిలో జరిగేవి ఇలాంటివి, తర్వాత ఇంటర్మీడియట్, హైస్కూల్,ఇప్పుడు ఆరు ఏడు తరగతులు, రేపు నాలుగో మూడో.
అసలు సమస్య పెంపకం కాదు, కనీసం పూర్తిగా. స్కూల్స్ కాదు మొత్తంగా. నాలెడ్జ్ లేకా కాదు ఆ విషయం లో, పూర్తిగా ఉండీ కాదు.
Adolescence ఒక మధ్య గడప లాంటిది ఆ child adult కాని ప్రాణికీ మరే ఇతర ప్రాణికీ కూడా.
పెద్దవాళ్ళనే ఒపీనియన్స్ నడిపిస్తున్నాయి , వాస్తవాలు కాదు ఏ విషయంలోనూ. ఇక పిల్లలను తన ఒపీనియన్స్, తన పైన ప్రపంచం ఒపీనియన్ ఇవే నడిపిస్తున్నాయి.
సందేహాలు మొదలయ్యేది అప్పుడే, అవి ఎవ్వరికీ చెప్పకూడదనే దాపరికం మొదలయ్యేది అప్పుడే.
దాచిపెట్టడం రెండు కారణాల వల్ల – బయటకు చెపితే తనను చిన్నచూపు చూస్తారేమో అనేది, అసలు తన చుట్టూ ఉన్న ఏ పెద్దవాళ్ళన్నా ముందు తనకున్న చిన్నచూపు.
ఇందులోనే ఆ Investigating officer కొడుకు లాంటి కాస్త ఈక్వానమిటీ ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నా మన బుడ్డోడికి ఈ అనుమానమో, అవమానమో, ఇంత ఘాతుకానికి పూనుకునే తెగింపో వచ్చేవి కావు.
పిల్లల్లో ఆడా మగా తేడా లేదు, అవమానపడటానికి మనసు విరిగిపోవడానికి, ఎంతకైనా తెగించటానికి.
ఉసికొల్పి తన కత్తి అప్పుగా ఇచ్చే ఒక వెధవ ఫ్రెండ్ ఉంటే చాలు వీళ్ళకు తమ పిరికి ప్రతాపం చూపించటానికి.
ఎప్పటికైనా ఒకటే పరిష్కారం- there should be a healthy dialogue, అమ్మనాన్నల్లో కనీసం ఒకళ్ళతో, లేదా తోబుట్టువో, ఒక టీచరో, ఫ్రెండో.
పదమూడేళ్ళ వాళ్ళకి ఎవరితోనూ తన సమస్య మాట్లాడటం ఇష్టం ఉండదు కాబట్టి పేరెంట్సో టీచరో అక్కో అన్నో దోస్తో పూనుకోవల్సిందే వాళ్ళతో మాట్లాడించటానికి.
ముందు వీళ్ళకి టైమ్ ఉండాలిగా అందుకు.



