మన బాపూజీ బొమ్మకు ఎందుకంత డిమాండ్..?

దాదాపు ఆర్టిస్టులంతా అటెంప్ట్ చేసే పోట్రెయిట్స్ లో మహాత్మాగాంధీకి కూడా కచ్చితంగా ఓ స్థానముండే ఉంటుంది. కానీ, నేరుగా మహాత్మాగాంధీనే కూర్చోబెట్టి వేసిన ఆయన ఒకే ఒక్క పోట్రెయిట్ ఈ మధ్యే 1 కోటి 70 లక్షల రూపాయలకు అమ్ముడైంది. వేలంలో ఎవరు దాన్ని కొనుగోలు చేశారనే విషయాన్ని ఆ ఫైన్ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు వెల్లడించలేదుగానీ.. గాంధీ లైవ్లీ పోట్రెయిట్ చిత్రీకరణ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఆ వివరాలంటో తెలుసుకుందాం రండి.

లండన్ లోని బాన్ హోమ్స్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీ వేలంలో మన మహాత్మాగాంధీ ఆయిల్ పెయింటింగ్ పోట్రెయిట్ కు అంత విలువ దక్కింది. దాని ధర.. 152,800 పౌండ్లు.. అంటే, ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 1 కోటి 70 లక్షల రూపాయలన్న మాట.

అంతకుముందెప్పుడూ వేలంలో ప్రదర్శించబడని గాంధీని నేరుగా కూర్చోబెట్టి వేసిన పెయింటిగ్ కు ఆన్లైన్ వేలం నిర్వహించడంతో పాటు.. 50 వేల నుంచి 70 వేల పౌండ్ల మధ్య ధరతో ఆఫర్ చేశారు. 2025, జూలై 15వ తేదీన ఈ వేలాన్ని నిర్వహించగా.. ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ సేల్ పేరిట నిర్వహించిన ఆ ఆన్లైన్ వేలం పాటలో గాంధీ పోట్రెయిట్ కే ఎక్కువ ధర పలికింది.

మహాత్మాగాంధీ పోట్రెయిట్ ను ఆయన్ను కూర్చోబెట్టి లైవ్లీగా చిత్రీకరించిన ఆర్టిస్ట్ పేరు క్లేర్ లైటన్. గాంధీ లండన్ కు వెళ్లిన సమయంలో ఈ పోట్రెయిట్ గీచే సందర్భం చిక్కింది. గాంధీని చూడాలని, గాంధీని తమ చిత్రాల్లో గీయాలని, గాంధీతో మాట్లాడాలని, కలిసి నడవాలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకెంత క్రేజ్ ఉండేదో ఈ సందర్భం వెల్లడించింది. అయితే, ఆయన్ను లైవ్లీగా చిత్రీకరించిన ఈ పోట్రెయిట్ కచ్చితంగా ఓ హిస్టారికల్ డాక్యుమెంటనే చెప్పుకోవాలి.

1931లో క్లేర్ లైటన్ అనే పెయింటర్ కమ్ రైటర్.. గాంధీని కలిసినప్పుడు ఈ అవకాశం దక్కింది. గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకావడానికి లండన్ కు వెళ్లినప్పుడు క్లేర్ లైటన్ కు గాంధీతో పరిచయమేర్పడింది. 1989లో ఆమె మరణించేవరకూ కూడా ఆ గాంధీ పెయింటింగ్ ఆమె వద్దే ఉంది. ఆ తర్వాత ఆమె కుటుంబం బాన్ హోమ్స్ ఫైన్ ఆర్ట్స్ గ్యాలరీకి అందజేసింది.

హెన్రీ నోయెల్ బ్రెయిల్స్ ఫోర్డ్ అనే లండన్ కు చెందిన పొల్టికల్ జర్నలిస్ట్.. గాంధీజీ అన్నా, ఆయన పోరాటమన్నా బాగా ఇష్టపడేవాడు. 1930లో ఇండియాకు కూడా వచ్చి గాంధీ చేస్తున్న పోరాటాల గురించి తెలుసుకుని మద్దతు తెలిపాడు. ఆ తర్వాత రెబెల్ ఇండియా అనే ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించారాయన. ఆ సమయంలోనే రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన గాంధీతో ఆయనకు మంచి పరిచయమేర్పడింది. బ్రెయిల్స్ ఫోర్డ్ కు.. క్లేర్ లైటన్ స్నేహితురాలు కావడంతో గాంధీకి లైటన్ నూ పరిచయం చేశాడు బ్రెయిల్స్ ఫోర్డ్.

బ్రెయిల్ ఫోర్డ్ తో పాటే గాంధీతో పరిచయం బలపడిన క్లేర్ లైటన్ తరచూ గాంధీ ఉండే కార్యాలయానికి వెళ్లేవారు. అలా ఆయన స్కెచ్ వేయడానికి క్లేర్ లైటన్ అనుమతి తీసుకుంది. కానీ, ఒక్కసారితో గాంధీ స్కెచ్ అండ్ పెయింటింగ్ పూర్తి కాలేదు. పలుమార్లు గాంధీని కలిసిన పలు సిట్టింగ్స్ లో ఆయన స్కెచ్ గీసి.. ఆ తర్వాత దాన్ని ఆయిల్ పెయింటింగ్ గా తీర్చిదిద్దారు క్లేర్ లైటన్. ఈ విషయాలని బాన్ హోమ్స్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులే వెల్లడించారు.

ఒక పెయింటిగ్ ఎగ్జిబిషన్ లో గాంధీ పోట్రెయిట్ ప్రదర్శన!

1931 నవంబర్ లో లండన్ లోని అల్బానీ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ప్రదర్శనలో లైటన్ తాను వేసిన గాంధీ పోట్రెయిట్ ను కూడా ప్రదర్శనకు పెట్టారు.

అప్పుడు మరో బ్రిటీష్ జర్నలిస్ట్ వినిఫ్రెడ్ హోల్ట్ బై ఆ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ట్రేడ్ యూనియన్ మ్యాగజైన్ అయిన ది స్కూల్ మిస్ట్రెస్ కోసం ఆయన పెయింటింగ్ ప్రదర్శనను గురించి ఓ కాలమ్ కూడా రాశారు. పార్లమెంట్ సభ్యులు, మాజీలు, కళాకారులు, జర్నలిస్టులు, కళా విమర్శకులు, చీరల్లో ప్రకాశవంతంగా మెరిసిపోతున్న భారతీయ మహిళలు, కొందరు హిందూ ప్రతినిధులు హాజరైన ఆ కార్యక్రమంలో రాజనీతిజ్ఞురాలు, కవయిత్రి నాయుడు.. అలాగే, మహాత్మగాంధీ కొలీగ్ అయిన పురుషోత్తమ్ దాస్ ఠాకూర్ కూడా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.

అయితే, ఆ ప్రదర్శనకు స్వయానా గాంధీ కూడా హాజరు కావల్సి ఉన్నా… ఆయన వెళ్లలేకపోయాడు. అయితేనేం, గాంధీ ఆయిల్ పెయింటింగ్ పోట్రేయిట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. గాంధీజీ ఏదో చెబుతున్నట్టుగా… నిండుగా పంచె కప్పుకున్న ఆ పోట్రెయిట్ చూస్తుంటే ఆయనే స్వయంగా వచ్చాడా అన్నట్టుగా ఫీల్ అయ్యారట జర్నలిస్ట్ వినిఫ్రెడ్ హోల్ట్ బై. ప్రపంచమంతా గౌరవించే రాజకీయ నాయకుడు, సమస్యలను సులువుగా పరిష్కరించగల్గే సంధానకర్త, తెలివైన న్యాయవాది, స్నేహితులైనా, శత్రువులైనా వారిని తన మాటలతో ఎలా లొంగదీసుకోవచ్చో తెలిసిన రాజనీతిజ్ఞుణ్ని నిజంగానే చూసినట్టనిపించింది ఆ పోట్రెయిట్ చూస్తే అంటూ ఒక పెద్ద ఆర్టికలే రాశారు వినిఫ్రెడ్.

ఆ పోట్రెయిట్ కు మంచి ఆదరణ దక్కడంతో.. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి మోహదేవ్ దేశాయ్ నుంచి లండన్ పెయింటర్ లైటన్ కు ఓ లేఖ వచ్చింది. దాని డూప్లికేట్ కాపీ చిత్రమొక్కటి గాంధీగారికి పంపిచాలని ఆ లేఖలో కోరారట దేశాయ్. అల్బానీ గ్యాలరీలో మీరు వేసిన గాంధీ పెయింటింగ్ చూసిన నా మిత్రులెందరో.. ఎలాంటి పోలికలు మిస్ కానంతగా మీ పెయింటింగ్ ఉందని చెప్పారు. దాన్ని మరో కాపీ పంపగల్గితే బాగుంటందనేది ఆ లేఖ సారాంశం.

ఇంతకీ ఆ ఆర్టిస్ట్ క్లేర్ లైటన్ ఎవరు?

క్లేర్ లైటన్ ఒక అమెరికన్ కళాకారిణి. రచయిత్రి, ఓ ఆర్టిస్. లండన్‌లో జన్మించిన క్లేర్ లైటన్… రాబర్ట్ లైటన్, మేరీ కానర్ లైటన్ అనే రచయితలైన దంపతుల కుమార్తె. క్లేర్ చిన్ననాటి జీవితం తన అన్న రోలాండ్ తో పాటే సాగింది. క్లేర్ లైటర్ ను ఆమె మామ జాక్ లైటన్ చిత్రలేఖనం వైపు ప్రోత్సహించాడు. 1915 పలు కళాశాలల్లో చిత్రలేఖనంలో ఫైన్ ఆర్ట్స్ కోర్సులు చేసింది. 1938లో పోస్టర్ డిజైనింగ్, ఆ తర్వాత ఇంగ్లాండ్ లోని పలు చర్చీల్లో స్టెయిన్డ్ గ్లాస్ కిటికీల పెయింటింగ్స్ లోనూ క్లేర్ లైటన్ పెయింటర్ గా వ్యవహరించింది.

1974లో బయటకొచ్చిన గాంధీ పోట్రెయిట్!

1978లో బోస్టన్ పబ్లిక్ లైబ్రరీలో లైటన్ రచనల ప్రదర్శన నిర్వహించేవరకూ కూడా.. లైటన్, గాంధీకి సంబంధించిన ఓ పోట్రెయిట్ పెయింటింగ్ గీసిందనే విషయం చాలామంది మర్చేపోయారు, ఇంకొందరికి అసలు తెలియనే తెలియదు. 1974లో ఆ పోట్రెయిట్ ప్రదర్శన కోసం తెస్తున్నప్పుడు ఓ అతివాది కత్తితో దాడికి పాల్పడినట్టు ఆర్టిస్ట్ లైటన్ కుటుంబీకులు చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. దాంతో ఆ ఫోటో కాస్త దెబ్బ తిందట. వెంటనే ఆ పోట్రెయిట్ ను 1974లో లైమాన్ ఆలిన్ మ్యూజియం కన్జర్వేషన్ ల్యాబ్ పునరిద్ధరించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles