Shankar G.. ✍🏼
జెమినీవాసన్… ఈ పేరు తమిళ్ నాడు లో ఏస్ ప్రొడ్యూసర్ అనవచ్చు. ఆయనకు అక్కడ ఎంత పెద్ద పేరు అంటే అక్కడ ఒకనానుడి ఉండేది సినిమా హిట్టయితే వాసన్ ప్లాఫ్ అయితే ఉపవాసన్ అని. అలాంటి నిర్మాత దగ్గరికి బాగా చదువుకున్న ఒక 20 ఏళ్ల కుర్రాడు వెళ్లి ఒక కథ వినిపించి తనకు దర్శకుడిగా అవకాశం ఇమ్మని అడిగాడు. ఆ కుర్రాడు ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీధర్. తను చిత్ర రంగానికి పరిచయం చేసిన స్టార్స్ లో జయలలిత, కాంచన , రవిచంద్రన్ లాంటివాళ్ళు ఉన్నారు. మన సూపర్ స్టార్ కృష్ణ తన మొదటి సినిమా అవకాశాన్ని కొంచంలో మిస్ అయ్యారు.

శ్రీధర్ దర్శకత్వంలో విడుదలైన తొలి కలర్ చిత్రం కాధలిక నేరమిల్లి. అది తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాతోనే రవిచంద్రన్ హీరోగా తెరంగేట్రం చేశాడు. సిల్వర్ జూబ్లీ హీరో అని చెప్పుకునే స్థాయిలో ఎన్నో సిల్వర్ జూబ్లీ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. అదేవిధంగా పలు కలర్ చిత్రాల్లో నటించారు. అప్పట్లో కలర్ ఫిలిమ్స్ లో నటించడం అంటే చాలా పెద్ద విషయం. ఈ రవిచంద్రన్ మలేసియ తమిళియన్.

కాధలిక నేరమిల్లి చిత్రంలో రవిచంద్రన్‌తో హీరోగా నటించేందుకు ఇద్దరు నటులు పోటీ పడ్డారు. వారిలో ఒకరు తమిళ్ స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్. శ్రీధర్ తన ఎత్తును సాకుగా చూపి అవకాశం ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ సినిమాలో హీరోగా నటించేందుకు పోటీ పడిన మరో నటుడు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కృష్ణ.
తమిళంతో కాస్త ఇబ్బంది పడటంతో ఆ అవకాశం రవిచంద్రన్‌కి దక్కింది. లేకుంటే ఆ సినిమాలో కృష్ణ హీరోగా నటించి ఉండేవాడు. ఆ అవకాశాన్ని కృష్ణ మిస్ చేసుకున్నారట. లేకపోతే కృష్ణ సౌత్ ఇండియా స్టార్ అయ్యేవాడేమో 😎. చిత్రంగా నాన్, అతే కనగల్ లాంటి తమిళ్ చిత్రాల్లో రవిచంద్రన్ యాక్ట్ చేస్తే నేనేంటే నేనే, అవేకళ్ళు లాంటి తెలుగు చిత్రాల్లో తెలుగులో కృష్ణ చేశాడు.
ఆ కాధలిక్క నేరమిళ్ళై చిత్రాన్ని తెలుగులో తీస్తే రవిచంద్రన్ పోషించిన ఆ పాత్రను అక్కినేని పోషించాడు. అక్కినేని లాంటి పెద్ద హీరో ఉన్నాసరే ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ లోనే తీశారు. పెద్ద మ్యూజికల్ హిట్ అయ్యింది. పాటలన్నీ తమిళ బాణినే అనుసరించారు.
అన్నట్టు ఈ సినిమా దర్శకుడు శ్రీధర్ రెడ్డి తమిళ్ నాడులో స్థిరపడ్డ తెలుగు మూలాలున్నవాడు.



