ఎంఎస్వీకి గురుతుల్యుడు: సినిమాలోని అన్ని పాటలూ.. హిట్టయ్యే పరంపరకు తెరతీసినవాడు!

రోచిష్మాన్, 9444012279… ✍🏼


నొ(నౌ)షాద్ పాట

“దో సితారోన్ కా జమీన్ పర్ హై మిలన్…”

1960లో వచ్చిన కోహినూర్ సినిమాలోని పాట “దో సితారోన్ కా జమీన్ పర్ హై మిలన్…”

నొషాద్ (నౌషాద్ అనడం సరికాదు) భారతదేశ సినిమా సంగీతంలో గొప్పగా పరిగణించబడిన సంగీత దర్శకుడు నొషాద్. దక్షిణాది ఉత్తమ సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్ తన మానసిక గురువు నొషాద్ అని చెప్పుకున్నారు.

1940లో వచ్చిన ప్రేమ్ నగర్ సినిమాతో నొషాద్ సంగీత దర్శకుడయ్యారు. 1944లో వచ్చిన రతన్ సినిమాతో నొషాద్ ఒక పూర్తి విజయవంతమైన సంగీత దర్శకుడయ్యారు. ఒక సినిమాలోని అన్ని పాటలూ హిట్ అవడం మనదేశంలో రతన్ సినిమాతోనే మొదలైంది!

నొషాద్ కన్నా ముందు అనిల్ బిశ్వాస్, పంకజ్ మల్లిక్, ఆర్. సీ. బోరల్, గులామ్ హైదర్, ఖేమ్‌చంద్ ప్రకాష్ వంటి సంగీత దర్శకులు పేరు గడించిన వారు. రతన్ సినిమాతో ఒక్కసారిగా నొషాద్ దేశంలో ప్రస్తుతిని పొందిన సంగీత దర్శకుడై పోయారు. అటు తరువాత దేశ సినిమా సంగీతంలో నొషాద్‌కు ఒక ప్రత్యేకమైన పరిగణన వచ్చి స్థిరపడి పోయింది.

Long notesతో నాణ్యమైన బాణిలు చేసి పాటల్ని సూపర్ హిట్స్ చేశారు నొషాద్. ఆర్. డీ. బర్మన్ కూడా ఇలా లాంగ్ నోట్స్ బాణిలతో గొప్ప పాటలు చేశారు. సింఫని తరహా వాద్య సంగీతాన్ని చెయ్యలేదు కానీ “ఆవాజ్ దే కహాన్ హై…” వంటి పాటల్లో కొన్ని melodiesను ప్రముఖ సింఫనిల నుంచి తీసుకున్నారు నొషాద్. తన సంతకం ప్రతి పాట మీద ఉండేట్టు శ్రద్ధ తీసుకునే వారు నొషాద్. (శంకర్- జైకిషన్ ప్రభావాన్ని తప్పించుకోలేక పోయారు)

ఆన్, ఉడన్ కటోలా, అమర్, బైజు బావ్రా, ముఘల్-ఎ-ఆజమ్, షబాబ్, గంగా జమ్‌నా, ఆద్మీ వంటి సినిమాల పాటలు, నేపథ్య సంగీతం విశేషమైనాయి.

1988లో ధ్వని అన్న మలయాళం సినిమాలో “జానకీ జానే రామా…” అన్న సంస్కృత రామ భక్తి గీతాన్ని చాల గొప్పగా చేశారు నొషాద్. (గీత రచయిత ముస్లీమ్ అయిన యూసఫ్ అలీ! చాల గొప్పగా రాశారు)

నొషాద్ చేసిన సినిమాల టైటిల్స్ మ్యూజిక్ మాత్రం విడిగా రికడ్ (రికార్డు)లుగా విడుదలయ్యాయి; అవి విదేశాల్లో కూడా విడుదలయ్యాయి అని వీ.ఎ.కె. రంగారావు నాకు చెప్పారు.

కొన్ని నొషాద్ పాటలు గులామ్ మొహమ్మద్ చేసినవి అన్న మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఇక్కడ ఉటంకించబడిన సినిమాల పాటలు గులామ్ మొహ్మద్ సహాయకుడుగా చెయ్యడం మానేసిన తరువాత నొషాద్ చేసినవే. “మా ఇద్దరిలో ఎవరు ఎవరిని ప్రభావితం చేశారో చెప్పడం కష్టమే” అని నొషాద్ స్వయంగా సరదాగా చెప్పేవారట. నొషాద్ గొప్పతనాన్ని ఆంతరంగీక సంభాషణల్లో కూడా గులామ్ మొహ్మద్ గట్టిగా చెప్పేవారు.

గులామ్ హైదర్ గట్టిగా నొషాద్‌కు స్ఫూర్తి. ఆర్.సి. బోరల్ కూడా గులామ్ హైదర్ పాటల్ని యథాతథంగా వాడుకున్నారు. దులారీ సినిమాలో నొషాద్ చేసిన “సుహాని రాత్ డల్ చుకీ…” పాట ఒక సజ్జాద్ హుసైన్ పాట అని వీ.ఎ.కె. రంగారావు నాకు తెలియజేశారు. తన పాటను వాడుకున్న నొషాద్‌ను సజ్జాద్ క్షమించలేదు; ఆ కారణంతో నొషాద్‌ను చులకనగా మాట్లాడేవారు సజ్జాద్.

సినిమా సంగీతం పరంగా నొషాద్‌ పరిగణననీయం కాదు అన్న ధోరణిలో బప్పీ లహరి బహిరంగా మాట్లాడారు. “నొషాద్ a over rated composer” అన్న మాట కూడా ఉంది! (నా మాట కూడా అదే)

నొషాద్ గొప్ప సంగీతం చేసిన సినిమాల్లో ఒకటి కోహినూర్. ఈ సినిమాలో పాటలు సంగీతం పరంగా గొప్పవి. అందులో ఒకటి ఈ “దో సితారోన్ కా జమీన్ పర్ హై మిలన్…” నొషాద్ చేసిన spirited పాటల్లో ఇది ఒకటి. పహాడీ రాగంలో చాల చాల సొంపుగా చేశారు నొషాద్.

వినండి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles