నరమాంసాన్ని ఇష్టపడే పులులుంటాయేమోగానీ.. పులి మాంసాన్నిష్టపడే నరులుంటారా..??

Vidyasagar polla… ✍🏼

……………………………………………………………………..

ఇదొక పులి కథ.. పులి మాసం కథ!

వినటానికి విచిత్రంగానే ఉంటుంది. ఆదివాసులు ఏం చేసినా మనకు విచిత్రంగానే తోస్తుంది. సినిమాల్లో ఉత్తుత్తిగా పులులతో కోట్లాడిన సినిమా యాక్టర్ల గురించే తప్ప, నిజంగా పులులతో పోరాడిన, మచ్చిక చేసుకున్న ఆదివాసుల గురించి మనకు తెలీదు.

చంద్రు మాడావి గురించి తెలుసా?

తెలీదు! పోనీ, చంద్రు మాడావి పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పిల్లాడి ఊరు ఛత్తీస్ ఘడ్. చిన్నతనం నుండే ఓ బుల్లి పులి పిల్లను పెంచుకున్నాడు . హాలీవుడ్ వాళ్ళు “జంగల్ సగా” పేరుతో ఇంగ్లీషులో ఓ సినిమా కూడా తీసారండోయ్!

సరే, ఇక పులి మాంసం కథకు వద్దాం. పులి మనుషుల్ని తింటుంది. మరి పులి మాంసాన్ని ఎవరు తింటారు? ఆదివాసులు! నమ్మక తప్పదు. అది కూడా అప్పుడపుడు
మాత్రమే. ఎందుకో తెలీదు!

ఈ బ్లాక్ అండ్ వైట్ పోటో చూడండి. ఓ పిల్లాడు నిల్చున్నాడు. ఎదురుగా మంట పెట్టి పులి మాంసాన్ని కాలుస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో తీసిన ఫోటో ఇది. ఇది తీసి అరవై సంవత్చరాలు దాటింది. ఆ తీసిన వాడి పేరు సునీల్ జానా.

తమ పూర్వీకులు పులి మాంసాన్ని కాల్చుకుని తిన్నది నిజమే అని ఆదివాసులు చెపుతున్నారు. అంతే కాదు, వాళ్ళు ఆరాధించే “బొంగా” దేవతకు పులి పాలు కూడా అర్పించే వాళ్ళట! దీన్ని ఆధారం చేసుకుని ప్రముఖ ఆదివాసీ కవి, రచయిత సుందర్ మనోజ్ హోంబ్రం ఒక కథ కుడా రాసారు.

ఇదండీ పులి మాంసం కథ!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles