ఒకనాటి ఒలింపియన్.. నేడు ఓ మాంక్! అమర్ నాథ్ నాగరాజన్ రూపాంతర కథ!!

జీవితంలో ఓ లక్ష్యంతో ముందుకు పోయేవాళ్లను… ఎలాంటి లక్ష్యం లేకుండానే సాగిపోయేవాళ్లను చూస్తుంటాం. అలాగే, అనుకున్న లక్ష్యాన్ని పట్టుబట్టి సాధించుకునేవాళ్లు… లక్ష్యం పెట్టుకున్నా ఆ టార్గెట్ ను రీచ్ కాలేక మధ్యలోనే కాంప్రమైజ్ అయ్యేవాళ్లు.. ఒక లక్ష్యం ఎంచుకుని అందులో అచ్చీరాలేదని లక్ష్యాన్ని మార్చుకునేవాళ్లు.. లక్ష్యం మార్చుకున్నాక వాటిని చేరుకునేవాళ్లు.. మార్చుకున్న లక్ష్యాలనూ ఛేదించలేనివాళ్లు.. ఇలా భిన్నరకాల జనసమూహమే సమాజం. అయితే, అందులో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాక… ఆ లక్ష్యంలో కావల్సినంత తృప్తి లభించక.. మరో లక్ష్యాన్నెంచుకుని.. మార్చుకున్న లక్ష్యంలోనూ ఓ పేరు సంపాదించేవారు అరుదు. అలాంటివారిలో స్వామి సత్యానంద సరస్వతి పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే… స్వామి సత్యానంద సరస్వతి.. ఒలింపిక్స్ లో భారత్ తరపున బాస్కెట్ బాల్ ప్లేయర్ గా ఆడి… ఆ తర్వాత వైరాగ్య భావనల పరంపరతో ఓ మాంక్ గా అవతరించిన కథ గనుక!

మాజీ ఒలింపియన్ గా… బాస్కెట్ బాల్ ప్లేయర్ గా సత్యానంద సరస్వతి పేరు.. అప్పుడు అమర్ నాథ్ నాగరాజన్. తమిళనాడు పెరియకులంలో జన్మించిన నాగరాజన్.. మొదట హాకీ, అథ్లెటిక్స్ వంటి రెండు క్రీడల్లో రాణిస్తూ… ఓ ప్రతిభావంతమైన అథ్లెట్ గా గుర్తింపు పొందాడు. కానీ, ఆ రెండు క్రీడల్లో తాను రాణిస్తున్నప్పటికీ.. సత్యానంద్ సరస్వతి హృదయాన్ని దోచుకున్న ఆట మాట్రం మాత్రం బాస్కెట్ బాలే. అలా బాస్కెట్ బాల్ పై మక్కువ పెంచుకున్న అమర్ నాథ్ నాగరాజన్… అందులోనూ ఓ విజయవంతమైన క్రీడాకారుడిగా రూపాంతరం చెందాడు. అలా బాస్కెట్ బాల్ ఛాంపియన్ స్థాయికెదిగిన అమర్ నాథ్ నాగరాజన్.. ఏకంగా 1980 మాస్కో ఒలింపిక్స్ లో భారతదేశం తరపున ప్రాతినిథ్యం వహించాడు.

1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ ను యూఎస్ బహిష్కరించడంతో… ఆ అవకాశం ఇండియాకు లభించింది. అయితే, ఆ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ కు అవకాశం దక్కడమే గెలిచినంత పని అన్నట్టుగా తాము భావించామంటూ మాంక్ సత్యానంద సరస్వతి… ఉరఫ్ అప్పటి అమర్ నాథ్ నాగరాజన్ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

అమర్ నాథ్ నాగరాజన్.. మాస్కో ఒలింపిక్స్ లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్ మాత్రమే కాదు… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా సేవలదించాడు. పదవీ విరమణనంతరం నాగరాజన్ లో ఓ మెటాఫోర్సిస్ కనిపించింది. అదే ఆయన్ను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించింది. 2019లో తన భార్యను కోల్పోయాక… ఇక పూర్తిగా ఆధ్యాత్మిక చింతనకే తన జీవితం పరిమితమైపోయింది. మొత్తంగా ఒకనాటి భారత బాస్కెట్ బాల్ ప్లేయర్, అథ్లెట్, హాకీ ఆటగాడు… ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యంగా నిల్చినవాడు కాస్తా… సర్వసంగ పరిత్యాగిగా మారిపోయాడు. అలా సన్యాసిగా… సత్యానంద సరస్వతిగా అవతరించాడు.

ఈ మధ్యనే స్పోర్ట్ స్టార్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను మాక్ సత్యానంద సరస్వతి పంచుకున్నారు. ఓ స్పోర్ట్స్ మ్యాన్ గా క్రమశిక్షణెంతో అవసరమన్న అమర్ నాథ్ నాగరాజన్… ఓ సన్యాసిగా అంతకంటే ఎక్కువని సత్యానంద సరస్వతిగా చెప్పుకొచ్చాడు. అయితే, అదే సమయంలో తనకు స్పోర్ట్స్ మ్యాన్ గా, ఇప్పుడు ఓ మాంక్ గా కంటే కూడా.. బ్యాకింగ్ రంగంలో పనిచేస్తున్నప్పుడు ఎదురైన సవాళ్లే మరింత ఛాలెంజింగ్ గా అనిపించాయనీ చెప్పుకొచ్చారాయన.

మొత్తంగా ఒలింపిక్స్ కీర్తిపతాకం నుంచి… ఓ మాంక్ గా అవతరించిన తమిళనాడుకు చెందిన స్వామి సత్యానంద సరస్వతీ కథ.. కచ్చితంగా రెగ్యులర్ స్టోరీస్ కు భిన్నమైంది, మరింత విశేషమైందే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles