ఒకే ఒక్క పాత్రను రిపీటెడ్ గా నటించిన రికార్డ్ హోల్డర్ జగదీశ్ రాజ్!

సినిమా సినిమాకో హీరో, విలన్ ను చూస్తుంటాం. అలాగే, ఒక హీరో, ఒక విలన్ వేర్వేరు సినిమాల్లో అవే క్యారక్టర్స్ లో నటించినా.. క్యారెక్టరైజేషన్ లో మాత్రం మార్పు తప్పనిసరిగా తరచి చూసుకుంటారు. కానీ, ఒక్క పోలీస్ ఆఫీసర్ మాత్రం మారకపోవడం మీరెప్పుడైనా బాలీవుడ్ సినిమాల్లో గమనించారా..? అవునూ, ఒకే ఒక్క యాక్టర్ ఆ కీర్తిని మూటగట్టుకున్నాడు. లిమ్కా, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సుల్లోకి ఎక్కేశాడు.

దాన్నే టైప్ క్యాస్టింగ్ అంటారు. ఒకే రోల్ ను తరచూ పోషించడం. ఆ రోల్ కు తనే సూట్ అవ్వడం. ఈ టైప్ క్యాస్టింగ్ నేటి రోజుల్లోనే కాదు.. ఎప్పట్నుంచో ఉన్నదే. కొందరు కళాకారులు అలా టైప్ క్యాస్టింగ్ తోనే తమకంటూ ఓ గుర్తింపు పొందారు. కొందరు విలన్స్ గా, మరికొందరు పోలీస్ ఆఫీసర్స్ గా ఆ ఐడెంటిటీని సంపాదించుకున్నారు.

అలా 144 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన నటుడే.. మన ఈ స్టోరీ హీరో.

అలాంటి సీనియర్ బాలీవుడ్ నటుడి గురించే మనమిప్పుడు చెప్పుకుంటున్నాం. ఒక్కసారో, రెండుసార్లో కాదు.. ఏకంగా 144 సార్లు పోలీస్ ఆఫీసర్ పాత్రలలోనే నటించి రికార్డులు సృష్టించాడతను.

11 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆ నటుడెవరు..?

1939లో బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి… 11 ఏళ్ల వయస్సులోనే రంగ ప్రవేశం చేశాడు ఆ నటుడు. ఆ తర్వాత ఏడాదికేడాది తన ప్రతిభకు సానపెడుతూ సపోర్టింగ్ రోల్స్ లో అవకాశాలు దక్కించుకున్నాడు. అందులో ప్రధానమైన పాత్ర పోలీస్ ఆఫీసర్.

ఆయనే జగదీశ్ రాజ్. ఐదు దశాబ్దాల నటనా ప్రస్థానంలో 144 సార్లు పోలీస్ ఆఫీసర్ గా నటించి.. గతంలో ఎవ్వరి పేరిటా లేని.. భవిష్యత్తులో కూడా అనుమానాన్నే మిగిల్చేన్నిసార్లు నటించి రికార్డులు కొల్లగొట్టాడు. జగదీశ్ రాజ్ ప్రత్యేకతేంటంటే.. ఇప్పటివరకూ కూడా బాలీవుడ్ లో ఎవ్వరూ కూడా ఒకే రకమైన పాత్రను ఇన్నిసార్లు వేయలేదు.

జగదీశ్ రాజ్ ప్రధాన చిత్రాలేంటి..?

1939లో విడుదలైన ఏక్ హీ రాస్తా సినిమాలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించాడు జగదీశ్. 1955లో వచ్చిన సీమా అనే చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో మధుమతి, కానూన్, కాలాబజార్, పాస్ పోర్ట్, ధర్మపుత్ర, బాంబే కా చోర్, వక్త్, భూత్ బంగ్లా వంటి ఎన్నో సినిమాలున్నాయి. 2013, జూలై 28వ తేదీన 85 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన జగదీశ్ రాజ్… పోలీస్ అధికారి పాత్రలో అన్నిసార్లు యాక్ట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ప్రపంచంలోనే అన్నిసార్లు ఒకే పాత్రను రిపీటెడ్ గా పోషించిన యాక్టర్ గా కూడా జగదీశ్ రాజ్ ది రికార్డ్!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles