ఇళైయరాజా పాట
——————————————————–
“బూపాళమ్ ఇసైక్కుమ్ పూమగళ్ ఊర్వలమ్…”
———————————————————-
రోచిష్మాన్, 9444012279.. ✍🏼
1982లో వచ్చిన తూఱల్ నిన్నుపోచ్చు తమిళ్ష్ సినిమాలో
ఇళైయరాజా (ఇళయరాజా కాదు) చేసిన పాట “బూపాళమ్ ఇసైక్కుమ్ పూమగళ్ ఊర్వలమ్…”
పల్లెటూరి నాయికానాయకుల ప్రేమ యుగళగీతం ఇది.
పల్లె వాతావరణంలోని పాట దట్టమైన పాశ్చాత్య సంగీతంతో ఉండచ్చా? అలా ఉంటే ఎబ్బెట్టుగా ఉంటుంది అన్న ఆలోచనా సరళికి అతీతంగా ఇళైయరాజా తనదైన తీరులో, స్థాయిలో గొప్పగా చేసిన పాట ఇది.

చెమ్మీన్ 1965లో వచ్చిన మలయాళం సినిమా. చెమ్మీన్ కథకు ప్రాతిపదిక జాలరులు, సముద్రతీరం. “సినిమా పాటలు, సంగీతం ఆ జాలరులకు, ప్రాంతీయతకు సంబంధించినట్టుగా లేవేంటి?” అని వీ.ఎ.కె. రంగారావు సలిల్ చౌధరీని అడిగితే “సినిమా సంగీతానికి అలా ఉండాల్సిన అవసరం, అగత్యం, నియమం అక్కర్లేదు” అని సలిల్ జవాబిచ్చారు.
పల్లెటూరి నాయికానాయకుల ప్రేమ యుగళగీతం అయిన ఈ పాట విషయంలో ఇళైయరాజా సాంద్రమైన, ప్రౌఢమైన పాశ్చాత్య సంగీతాన్ని ప్రయోగించి గొప్ప ఫలితాన్ని సాధించారు.
మిశ్ర గౌరిమనోహరి రాగం చిక్కని పాశ్చాత్య సంగీతాన్ని పొదువుకుని బహు రమ్యమైన ఈ పాటై ప్రవహించింది.
Prelude నుంచీ పాట విశిష్టంగా ఉంటుంది. Preludeలో గ్రామీణ సంగీతంతో పాశ్చాత్య సంగీతాన్ని మిళితం చేసిన వైనం ప్రశంసనీయం. Chromatic downward sequence of piano chordsతో రితమ్ (రిథమ్ కాదు) అమర్చారు ఇళైయరాజా. ఇళైయరాజా మేధ, ఆలోచనా సరళి, ప్రయోగశీలత్వం, ప్రజ్ఞ విశేషమైనవి అని ఈ
chromatic downward sequence of chords రితమ్ నిర్ద్వంద్వంగా తెలియజేస్తుంది.
పల్లవి, చరణాలు contrasting phrasesతో గొప్పగా ఉంటాయి. చరణాల స్వర నిర్మాణం గొప్పగా ఉంటుంది.
రెండో interludeలో గ్రామీణత తొణికిసలాడుతూ ఉంటుంది.
Folk and western fusion గొప్పగా ఉంటుంది పాటలో.
Chromatic downward sequence of piano chords తరువాత ఈ పాటలో bass guitar ప్రయోగించబడ్డ తీరు చాల గొప్పగా ఉంటుంది.
ఈ పాటలో మరో విశేషాంశం abstractness. Abstract paintings మనకు తెలుసు. ఆ తీరులో conventional cohesion (సాధారణ పొందిక)కు అతీతంగా orchestration and tune phrases and melodiesతో ఈ పాట విశేషంగా నిర్మితమైంది.
‘సాంద్రమైన సంగీత ప్రౌఢిమ పామర జనరంజకమై పరిఢవిల్లుతుంది’ అన్న సత్యానికి ఈ పాట ఒక తిరుగులేని మచ్చుతునక.
పాట బాగా ఉండడం, మధురంగా ఉండడం, భావంతో ఉండడం ఇటువంటి మౌలికమైన లేదా మామూలు స్థితికి మించిన విశేషమైన సంగీతజ్ఞతతో ఉద్భవించిన విశిష్టమైన పాట ఇది.
1982లో ఈ స్థాయి ప్రౌఢిమతో, ప్రజ్ఞతో తెలుగు సినిమాలో పాటలు వచ్చాయా? వస్తే ఒకరికొకరం చెప్పుకుని సంతోషిద్దాం; రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకుందాం.
పాటను ఏసుదాస్, ఉమా రమణన్ చక్కగా పాడారు.
వినండి..



