పాస్ పోర్ట్ ఇండెక్స్ లో పైకి ఎగబాకిన భారత్: ఇంతకీ హెన్లీ సూచిక ఏం చెబుతోంది..?

పాస్ పోర్టుల ర్యాంకింగ్ లో భారత్ స్థానం మెరుగుపడింది. 85వ స్థానంలో ఉన్న స్థానం ఇప్పుడు 77కు తగ్గి మెరుగుదల కనిపిస్తోందని హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2025 సర్వే వెల్లడించింది. లండన్ కు చెందిన గ్లోబర్ సిటిజన్ షిప్ అండ్ రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థైన హెన్లీ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్ట్ తాజాగా ఈ త్రైమాసికంలో వెల్లడించిన నివేదికలో ఎనిమిది స్థానాలు ఎగబాకి.. గతంలో ఉన్న 85వ ర్యాంకు నుంచి ఇప్పుడు 77వ ర్యాంక్ సంపాదించుకుంది.

దీంతో భారతీయ పాస్పోర్ట్ కల్గిన హెల్డర్సంతా వీసా లేకుండా వీసా ఆన్ అరైవల్ తో సందర్శించే దేశాల సంఖ్య 57 నుంచి మరో రెండు దేశాలకు పెరిగి 59 అయింది.

మరి భారత్ పాస్ పోర్ట్ కల్గిన వారు ఎక్కడెక్కడ వీసా ఫ్రీ ప్రయాణం చేయొచ్చు..?

ఇండోనేషియా, మాల్దీవులు, థాయ్ లాండ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ఆసియా దేశాలన్నీ ఇప్పటికే వీసా ఫ్రీ ఎంట్రీని అందించే ప్రాంతాలు కాగా.. మకావు, మయన్మార్ వంటి దేశాలకు ముందస్తు వీసా లేకుండానే వెళ్లే విధంగా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ ను భారత్ కల్గి ఉంది.

ఇప్పుడు తాజాగా వీసారహిత గమ్యస్థానాల జాబితాలో ఫిలిప్పీన్స్, శ్రీలంక దేశాలు కూడా చేర్చారు.

కేవలం రెండు దేశాలను అదనంగా చేర్చడం వల్ల ఒనగూరేదేంటనిపించినా.. దౌత్యపరంగా ఇది ప్రాధాన్యత ఉన్న అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. మొబిలిటీ పరంగా చూస్తే పక్కనున్న పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోలిస్తే స్వేచ్ఛగా భారత్ పాస్ పోర్ట్ కల్గినవారు వీసా ఆన్ అరైవల్ పద్ధతిలో వీసా లేకుండా మరిన్ని ఎక్కువ దేశాలకు ప్రయాణించే వెసులుబాటులో ముందంజలో ఉంది.

వీసా ఫ్రీ ప్రయాణంలో ఆసియా దేశాలదే పైచేయి!

హెన్లీ సూచిక ప్రకారం వీసా ఫ్రీ కంట్రీస్ అందించే వెసులుబాటును ఆసియా దేశాలే ఎక్కువ కల్గి ఉన్నాయి. అందులో సింగపూర్ 193 దేశాలకు వీసారహిత ప్రయాణాన్నందించేలా మొదటిస్థానంలో నిలవడం విశేషం. జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా ఆ తర్వాతి స్థానాల్లో 190 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణాన్నందించే రెండో స్థానాన్ని సంపాదించుకున్నాయి.

ఇక ఏడు యురోపియన్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు 189 దేశాలను తమ పాస్ పోర్ట్ తో వీసా లేకుండా చుట్టివచ్చే సౌకర్యాన్ని పొంది మూడోస్థానంలో ఉన్నాయి.

ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్వీడన్.. ఆ తర్వాత 4వ స్థానాన్ని సంపాదించుకోగా.. న్యూజిలాండ్, గ్రీస్, స్విట్జర్లాండ్ 5వ స్థానంలో ఉన్నాయి.

ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, హంగేరీ, మాల్టా మరియు పోలాండ్ 7వ స్థానంలో ఉండగా, కెనడా, ఎస్టోనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 8వ స్థానంలో నిల్చాయి.

పెద్దన్న దేశంగా చెప్పుకునే అమెరికా ఈ హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ లో ఈ 2025 సర్వేలో కేవలం 182 దేశాలకు వీసా ఫ్రీ ఆన్ అరైవల్ ను అందిస్తూ పదో స్థానానికి పడిపోయింది. గత జనవరిలో యూఎస్ 9వ స్థానంలో ఉంటే మరో స్థానం తగ్గిపోయింది. గత జనవరిలో 5వ స్థానంలో ఉన్న యూకే.. 186 దేశాలకు ఫ్రీ వీసా సౌకర్యాన్ని కల్పిస్తూ 6వ స్థానానికి పడిపోయింది. గమనించాల్సిన విషయమేంటంటే.. 2015లో యూకే, 2014లో యూఎస్ అగ్రస్థానంలో నిలవగా.. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రయాణ హక్కులను పెంచుకునే విషయంలో ఈ రెండు దేశాల వ్యవహారశైలి కూడా ఈ పాస్ పోర్ట్ ఇండెక్ట్ సర్వేతో వెల్లడైంది.

రైజింగ్ స్టార్స్: సౌదీ అరేబియా, చైనా!

సౌదీ అరేబియాను ఈ ఇండెక్ట్ ప్రకారం రైజింగ్ స్టార్ గా అభివర్ణించవచ్చు. జనవరి నుంచి ఈ దేశం నాలుగు కొత్త వీసా రహిత దేశాలను సాధించి.. తన పాస్ పోర్ట్ వెయిట్ పెంచగల్గింది. సౌదీ అరేబియా పాస్ పోర్ట్ ఉంటే ఇప్పుడు 91 దేశాలకు వీసా ఫ్రీగా వెళ్లిరావొచ్చు. 2015లో 94వ స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు ఏకంగా 60వ స్థానానికి చేరుకుంది. అయినప్పటికీ ఐరోపాలోని స్కెంజెన్ ప్రాంతానికి వీసా రహిత ప్రవేశం లేకపోవడం చైనీస్ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ సూచికలో యథావిధిగా ఆఫ్ఘనిస్తాన్ 99వ స్థానంతో చివరి స్థానంలో నిల్చింది. కేవలం 25 గమ్యస్థానాలకు మాత్రమే వీసా రహిత ప్రవేశం కల్పిస్తోంది ఆఫ్ఘాన్ పాస్ పోర్ట్. ఈ ఏడాది ప్రారంభంలో కంటే కూడా దాని వెయిట్ ను కోల్పోయింది.

అయితే ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్స్ తో పాటు, బలహీనమైన పాస్పోర్ట్స్ మధ్య అంతరాన్ని స్పష్టం చేస్తుంది. ప్రపంచ పర్యాటకంలో ఈ ఇండెక్స్ లో కనిపించిన ఈ వ్యత్యాసాలు అసమానతలను కూడా పట్టిచూపించేవి.

పాస్ పోర్ట్ కు ఎందుకంత ప్రాధాన్యత..?

హెన్లీ అండ్ పార్ట్నర్స్ సీఈవో డాక్టర్ జుర్గ్ స్టెఫెన్ ఏమంటారంటే.. పాస్‌పోర్ట్ ను కేవలం ప్రయాణ పత్రంగానో, ఓ టిక్కెట్ గానో మాత్రమే చూడలేం. అంతకంటే ఎక్కువ. ఒక దేశం దౌత్యపరంగా ఏ స్థాయిలో ఉంది, అలాగే ఇతర దేశాలతో ఎలా కలిసిపోతోంది, ఆయా దేశాల విదేశాంగ విధానాలెలా కొనసాగుతున్నాయో కూడా పాస్ పోర్ట్ ప్రతిబింబిస్తుందంటారాయన.

భౌగోళిక అనిశ్చితి, పెరుగుతున్న ఆర్థిక అసమానతల కాలంలో పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేమాత్రం కాదు. ఒక దేశపు దౌత్యవిధానాన్ని, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపర్చేదనే వాదనను వినిపిస్తున్నారు నిపుణులు. అదే సమయంలో ఒక దేశం నివాసితులై.. మరో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతూ తమ దేశ పాస్ పోర్ట్ తో పాటు.. మరో దేశానికి సంబంధించిన ప్రత్యామ్నాయ పాస్ పోర్ట్ కల్గి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నవారిలో అమెరికన్స్, బ్రిటీషర్స్ ఎక్కువగా ఉన్నట్టుగా కూడా వారు చెబుతున్నమాట.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ నుంచి సేకరించిన డాటా ప్రకారం హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రతీ త్రైమాసికానికొకసారి అన్ని దేశాల పాస్ పోర్ట్ బలాబలాలేంటో తెలియజెప్పేందుకు ఈ సూచికను విడుదల చేస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles