రామాయణంలో అయోధ్య నగరానికెంత ప్రాముఖ్యతో.. లంకకంత ప్రత్యేకత. అదిగో ఆ చిన్న కనెక్టివిటీనే పట్టుుకుంది ఇప్పుడు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్. తమ ఎయిర్ లైన్స్ బిజినెస్ పెంచుకోవడంతో పాటే.. శ్రీలంక పర్యాటకం వైపూ ఆకట్టుకునేలా ఓ అడ్వర్టైజ్ మెంట్ ను రూపొందించింది శ్రీలంకన్ ఎయిర్ లైన్స్. దాన్ని Relive the epic of The Ramayana Trail పేరుతో X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది.

అమ్మమ్మ తన చేతుల్లో బొమ్మలతో కూడిన ఓ కథల పుస్తకాన్ని పట్టుకుని తన మనవడికి కథ చెబుతూ ప్రారంభమైంతుది ఓ వీడియో. అలా కథ నడుస్తున్న క్రమంలో మరి రావణుడు సీతను ఎక్కడికి తీసుకెళ్లాడని అడుగుతాడు జిజ్ఞాస కల్గిన ఆ మనవడు. అప్పుడు అమ్మమ్మ… లంకలో ఉంచాడని.. అదే నేటి శ్రీలంక అని చెబుతుంది. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ తన ఎయిర్ లైన్స్ అడ్వర్టైజింగ్ లో భాగంగా రూపొందించిన ఆ ఐదు నిమిషాల వీడియో ఇప్పుడు అందరి మనసుల్నీ దోచేస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియన్స్ నైతే మరీను!
అలా అమ్మమ్మ, మనవడి మధ్య కథలతో… హైందవ గ్రంథాల్లోని రామాయణాన్ని ఎంపిక చేసుకుని.. ఏకంగా బొమ్మల బుక్ నుంచి శ్రీలంకలో ఆకట్టుకునే జలపాతాలు, సీతమ్మవారి ఆలయం వంటివెన్నో చూపిస్తూ శ్రీలంకకు అర్జెంటుగా వెళ్లిపోవాలనే ఒకింత క్యూరియాసిటీని కల్గించేలా వీడియో రూపకల్పన చేశారు.
రామసేతు ఇప్పటికీ ఉందా అన్న మనవడి ప్రశ్నకు.. భారతదేశంలోని రామేశ్వరం, శ్రీలంక మధ్య సముద్రతీరంలో ఉందంటూ ఆ అమ్మమ్మ చెప్పే వీడియో కథ.. ఇప్పుడు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ పబ్లిసిటీకి బాగా ఉపయోగపడుతోంది.
ఆ వీడియో పోస్ట్ ను శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో… భిన్నమైన ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఇప్పటివరకూ టూరిజం అంటే శ్రీలంకవైపు పెద్దగా ఆసక్తి కనబర్చనివారందెరో ఆ వీడియో చూసి… వావ్ అంటున్నారు. ఓ నెటిజనైతే ఏకంగా వచ్చే ఏడాది తాను స్నేహితులతో కలిసి టోక్యోకు ప్లాన్ చేసుకున్న ట్రిప్పును క్యాన్సిల్ చేసుకుని… తన పర్యటను శ్రీలంకకు మార్చుకుంటున్నట్టు వెల్లడిస్తే… మరో నెటిజన్, మీ ప్రకటన చూసిన తర్వాత మరోసారి శ్రీలంకకు రావాలనిపిస్తోందంటూ ప్రతిస్పందిచాడు.
ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా దివాళా పరిస్థితుల్లో ఉన్న శ్రీలంక వంటి దేశానికి… పర్యాటకం కలిసొచ్చే అంశం. అయితే, కావల్సిందల్లా కాస్తంత క్రియేటివిటి. అదిగో ఆ సృజనాత్మకతతోనే ఇప్పుడు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ రూపొందించిన టూరిజం అడ్వర్టైజ్ మెంట్ వైరల్ గా, పెద్ద చర్చగా మారిపోయింది.
రామాయాణ్ని తిరిగి ఆస్వాదించండి. శ్రీలంకలో మీ హాలిడేస్ ను ప్లాన్ చేసుకుని.. ప్రకృతి సిద్ధమైన శ్రీలంకలో మీ పౌరాణిక ప్రయాణాన్ని ప్రారంభించండి. కొత్త అనుభూతిని ఆస్వాదించండి. రామాయణం వంటి పురాణాల్లో చెప్పిన ప్రతీ సంగతినీ మీరు కళ్లతో చూసినప్పుడు.. పురాతన కథల్లో గొప్పతనాన్ని, వైభవాన్నీ మీరు పొందగల్గుతారు. మొత్తంగా మళ్లీ రామాయణ కాలంలోకి మిమ్మల్ని మా శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ లో తీసుకెళ్లి.. మంత్రముగ్ధుల్ని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. మరి మీరు మీ ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు… ఛార్జీల్లోనూ డిస్కౌంట్స్ ఉన్నాయంటూ ఊరించేలా ఆ ప్రకటనను సిద్ధం చేసింది శ్రీలంకన్ ఎయిర్ లైన్స్.
చివరి వాక్యంగా Don’t miss out! start your own Ramayana Trail now! అంటూ ఇంకా మిగిలిన సమాచారం కోసం ramayanabysrilankan.com వెబ్సైట్ ను సంప్రదించండంటూ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ వేసిన తన ప్రచార ఎత్తుగడకు మంచి స్పందనను తీసుకొచ్చింది.
తన ప్రచారంలో భాగంగా తయారుచేసిన వీడియో రూపకల్పనలో మధ్యలో హన్మంతుడి గురించి చెబుతూ లంకాదహనాన్ని అమ్మమ్మ మనవడికి చెప్పేటప్పుడు.. మనవడు లేసి, ఓ ఓ ఓ అంటూ ఒకింత ఆందోళనగా అరుస్తున్నట్టు చేసిన చిత్రీకరణ ఆకట్టుకుంది.
ఇప్పటికీ లైన్స్ రాక్స్ లో రావణుడింకా బతికే ఉన్నాడని నమ్మేవారున్నారనే ఒక భావనను… రామాయణ స్ఫూర్తిని కల్పిస్తూ సాగిన వీడియో చాలామందిని హత్తుకుంటోంది. చివరగా మనవడు మనం కూడా శ్రీలంకకు వెళ్దామా అన్నప్పుడు అమ్మమ్మ తప్పకుండా అంటూ… మీ నాన్న ఈ ఏడాది రామాయణ ట్రయల్ కు సిద్ధం చేస్తున్నాడని చెబుతుంది. ఆ అబ్బాయి తన బాల్కనీ డోర్ తీయడంతోనే సముద్రంపైన శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ఎగురుతూ వెళ్లడం.. అందులోంచి ముగ్గురు హెయిర్ హోస్టెస్ స్వాగతం పలుకుతున్నట్టుగా వందనం చేయడం.. ఇదిగో ఒక బ్యూటీఫుల్ వీడియో ప్రచారంతో ఇప్పుడు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ తన బిజినెస్ తో పాటు.. తమ దేశ పర్యాటం వైపూ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఓ కొత్త ఎత్తుగడను ఎంచుకుంది.



