BT GOVINDAREDDY…✍️
Schadenfreude (షాదన్ ఫ్రోయిడ) రుగ్మత:
మనందరికీ తెలిసిన వాడు ఒకడుంటాడు. ఎవరితో పెద్దగా కలవడు. ఆత్మ విశ్వాసం జీరో. అందరి గురించి ఫిర్యాదు చేస్తుంటాడు. ఎదుటి వాళ్లు బాధ పడితే చూసి ఆనందించాలనే తహతహ కనిపిస్తుంది. దానికి ఇతను ఎంచుకునే మార్గం ఏమిటంటే…
ఎవరో తన లాంటి మరో వ్యక్తి దగ్గర మన గురించి ప్రస్తావిస్తాడు. అతను ఏదో తిక్కగా కామెంట్ చేస్తాడు. అకారణంగా అతను నిందించే కొద్దీ వీడిలోఆనంద భాష్పాలు నల్లా నీటిలా చిమ్మిచ్చి (ఫుల్ ప్రెషర్ తో) కొడుతుంటాయి. మరో రెండు మాటలు జోడించి మంటను మరింత రాజేస్తాడు. ఆరోజుకు తన ఆకలి చల్లారినట్టు భ్రమపడతాడు.

మరుసటి రోజు మీకోసం అన్వేషిస్తాడు. లేకపోతే ఫోన్ చేస్తాడు. ఫలానా వాడు మనల్ని ఏమన్నాడో పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాడు. మనం అతని మాటలు విని రియాక్టు అయ్యామంటే అతనికి మళ్లీ చేరుతుంది. మోసేది వీడే. అలా అకారణంగా తిట్టేవాని దగ్గర ఒకసారి, వాటిని చేరవేసాక… మనం వేదనకు గురయితే ఇంకో సారి వాడి ఆనందం కట్టలు తెంచుకుంటుంది. “అక్కడి మాటలు ఇక్కడికి” మోసే ఇటువంటి వ్యక్తుల మానసిక స్థితిని షాదన్ ఫ్రోయిడ (Schadenfreude) రుగ్మతగా సైకాలజి అభివర్ణిస్తుంది.
ఎందుకిలా ప్రవర్తిస్తారు?
అదో అనియంత్రిత మానసిక వైకల్యం. నిత్యం అబధ్రతా భావనలో కొట్టుమిట్టాడే వారు ఇలా ప్రవర్తిస్తారు. మితిమీరిన స్వార్థం, అసూయలు ఇతరులతో స్నేహానికి అడ్డుపడుతుంటాయి. నమ్మకస్తులుగా ఉండరు కాబట్టి ఎవరూ దగ్గరకి రానీయరు.
వీళ్లు అక్కడి మాటలు ఇక్కడికి మోసినప్పుడు… విన్న(బాధిత) వ్యక్తి స్పందించక పోవడమే వీళ్లకు సరైన ఔషధం. అతను ఏ కారణం లేకుండా నా గురించి నీచంగా ఎందుకుతిడతాడు. అని మనం అన్నామంటే “షాదన్ ఫ్రోయిడ”లు విలవిల్లాడిపోతారు. పప్పులుడకలేదని నిరాశ పడతారు. మనం రియాక్టు కాకపోవడమే వీళ్ల రుగ్మతకు మందు.
Insecurity and Low Self-Esteem
Research suggests that people with lower self-esteem tend to experience higher levels of schadenfreude. By tearing others down through gossip, they temporarily soothe their own inner insecurities and feelings of inadequacy.
source: British Journal of Psychology


