సింఫనీ సరే! మరి, ఇళయరాజా కాన్సర్టో గురించి తెలుసా..?

ఇళైయరాజా – Concerto

———————-

రోచిష్మాన్, 9444012279… ✍️

ఇళైయరాజా పాటలు, పాటలకు వాద్య సంగీతం, రి రికడింగ్ (రీ రికార్డింగ్) గొప్పగా చెయ్యడం మనం చెప్పుకుంటున్నదే.

ఇళైయరాజా (ఇళయరాజా కాదు) వెస్టన్ సంగీత ప్రజ్ఞ చాల గొప్పది. శంకర్-జైకిషన్, ఆర్.డీ. బర్మన్ తరువాత మనదేశ సంగీత దర్శకుల్లో వెస్టన్ సంగీతం విలువను, ఆవశ్యకతను ఆపోసన పట్టినది, ఆ వెస్టన్ సంగీతాన్ని గొప్పగా ప్రయోగించినది ఇళైయరాజానే.

ఇవాళ ఇళైయరాజా వెస్టన్ సంగీతంలో అతి క్లిష్టమైన సింఫని కూడా చేసేశారు. సింఫని చేసిన తొలి భారతీయుడు ఇళైయరాజా. ఎషిఅ(Asia)ఖండంలో సింఫని చేసిన రెండో వ్యక్తి ఇళైయరాజా.

మనదేశ సినిమాల్లో పంకజ్ మల్లిక్ 1936లో harmony ని ప్రవేశపెట్టారు; అనిల్ బిశ్వాస్ 1942లో coutersubjects or countermelodiesను ప్రవేశ పెట్టారు. శంకర్ – జైకిషన్ తొలిగా సింఫని తరహా సంగీతం చేశారు. ఆర్.డీ. బర్మన్ base line chords, and musicను ప్రధానం చేశారు. ఇళైయారాజా ఈ అన్ని అంశాలతో ప్రయోగించినంత దట్టంగా వెస్టన్ సంగీతాన్ని ఆయనకు ముందు మరో సంగీత దర్శకుడు చెయ్యలేదు. Chords పరంగా ఇళైయరాజా గొప్ప విద్వత్, ప్రజ్ఞ , సృజనాత్మకతను ప్రదర్శించారు.

ఇవాళ అంతర్జాతీయంగా తన సింఫనిని సమర్పించిన ఇళైయరాజా 1981లోనే concerto లేదా instrumentalను సినిమాలో చేశారు. రాజ పార్వై (తెలుగులో అమావాస్య చంద్రుడు) సినిమాలో ఉన్నతమైన 4 నిమిషాల modern concertoను చేసి సమర్పించారు. Concerto or instrumental అంతర్జాతీయ సంగీతంలో చాల విశేషమైంది.

ఇళైయరాజా modern concertoను మన కర్ణాటక సంగీత పంతువరాళి రాగంలో చేశారు! ఈ concerto ఇళైయరాజా జ్ఞానం, ప్రతిభ, ప్రజ్ఞ, ప్రయోగశీలత్వం వీటికి తార్కాణం.

అత్యున్నతమైన వాద్య కళాకారులు వీ.ఎస్.నరసిమ్మన్ (వైఅలిన్), పార్దసారది (వీణ), టీ.వీ. గోపాలకృష్ణన్ (మృదంగం), సదానందం (గిటార్) వంటి పలువురు ఈ concertoలో తమ నైపుణ్యాన్ని చవి చూపించారు.

1981కే కాదు ఇప్పటికీ తెలుగు సంగీత రసజ్ఞ మేధావర్గం ఘంటసాల, పెండ్యాల దగ్గరే ఆగిపోయింది. అంతకు మించి ఆ వర్గం ఎందుకు పైకి, ముందుకు జరగడం లేదు?

మన సంగీత రసజ్ఞత కళ్లు సరిగ్గా తెరుచుకోవాలేమో? మనకూ సంగీతం పరంగా మనో వికాసం కలగడం అంత పెద్ద తప్పుకాదేమో?

రండి 1981లోనే మనదేశంలో వచ్చిన అంతర్జాతీయ స్థాయి concertoను విందాం; మనం మనల్ని అంతర్జాతీయ స్థాయి సంగీతంలోకి నడుపుకుందాం. వినండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles