స్వీట్ సిక్స్టీన్ కోసం ఆరాటం! యాంటీ ఏజింగ్ కై బ్రయాన్ జాన్సన్ బాటలో మరో మహిళ!!

ఏ కొందరో ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారిని మినహాయిస్తే… బతుకుమీద ఆశ ఉండని వారెవ్వరు..? అందులోనూ ఎప్పుడూ నవ యవ్వనంగా ఉండాలనే కోరిక మాత్రం ఎందుకుండదు. సతీసావిత్రంతది తన భర్త కుష్ఠురోగానికి గురైనా భరించిందే తప్ప.. తన భర్త ప్రాణాలకై ఆ యముడు వస్తే తన పాతివ్రత్య శక్తితో అడ్డుకుందే తప్ప… విధి ఇంతే అనుకోలేదే! అదిగో అలాంటి కోరికలు ఈ కాలంలోనూ కనిపిస్తున్నాయి. ఆ మధ్య ఓ కంపెనీ సీఈవో బ్రయాన్ జాన్సన్ ను రివర్స్ ఏజింగ్ వైపు అడుగులు వేయిస్తే.. ఇప్పుడు మరో మహిళ కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది.

ఆమె పేరు జూలీ గిబ్సన్ క్లార్క్. అమెరికాకు చెందిన ఈ మహిళకు 56 ఏళ్లు. రోజుకు కేవలం 12 డాలర్ల ఖర్చుతో ఈమె ప్రస్తుతం.. యువ్వనంలోకి రివర్స్ గా పయనిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆమె ఏజింగ్ విషయానికొస్తే… గతంలో కంటే 34 శాతం నెమ్మదిగా కార్ల్క్ వయస్సు పెరుగుతోందట. ఇందుకు తన కొడుకు బ్లడ్ ప్లాస్మాను ఉపయోగించడం ఈమెకు బాగా కలిసివచ్చిందంటున్నారు వైద్యులు.

రివర్స్ ఏజింగ్ పై పరిశోధనలు కొనసాగిస్తున్నrejuvenation of olympics… క్లార్క్ సగటు వ్యక్తి కంటే చాలా నెమ్మదిగా వృద్ధాప్య రేటును సాధిస్తున్నట్టుగా ఇప్పటికే గుర్తించింది. డునెడిన్ పేస్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు… క్లార్క్ రివర్స్ ఏజింగ్ కు సంబంధించి వయస్సు నెమ్మదించే ప్రక్రియ ప్రోగ్రెసివ్ గా కనిపించిందట.

తన తండ్రి నుంచే తాను ప్రేరణ పొందానని చెబుతోంది క్లార్క్. ఆహారాన్ని శరీరానికి ఇంధనంగా చూడటం.. అందుకోసం పోషకాహారానికి ప్రాధాన్యతనిచ్చే అలవాటును ఆమె తన తండ్రి నుంచే నేర్చుకున్నట్టు చెబుతోంది. క్రమశిక్షణ, పోషకాహార అలవాట్ల ద్వారా మన శరీరాన్ని యాంటీ ఏజింగ్ కు అనుగుణంగా మార్చుకోవచ్చని చెబుతోంది క్లార్క్.

25 ఏళ్ల నుంచే యాంటీ ఏజింగ్ కోసం కృషి!

వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో వస్తున్న మార్పులను గమనిస్తూ వచ్చిన క్లార్క్.. వీలైనంతగా వృద్ధాప్యాన్ని తగ్గించాలనే పట్టుదలతో ఉండేదట. దాంతో ఈమె వృద్ధాప్యాన్ని తగ్గించాలంటే బలమైన పోషకాహారం తినడం, దురలవాట్లను మానేయడంతో పాటు.. వీలైనంత ఒత్తిడికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానంటోంది.

గత 25 ఏళ్లుగా వృద్ధాప్యాన్ని సవాల్ చేస్తూ తన దినచర్యలుంటాయి. కేవలం కొన్ని సప్లిమెంట్స్, ఇంటి భోజనంతో తన రూపంలోనూ, శరీరంలోనూ మార్పులను తీసుకొచ్చానంటోంది క్లార్క్. అదే సమయంలో మద్యం సేవించడం మానేయడంతో పాటు… యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ కూ దూరం జరిగింది.

రివర్స్ ఏజింగ్ కోసం క్లార్క్ దినచర్యలెలా ఉంటాయి..?

మెడిటేషన్ లో ఉండే ఏకాగ్రత ఒత్తిడిని తేలికపరుస్తుందని నమ్మే క్లార్క్… ఉదయం ప్రార్థనలతో తన దినచర్య ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు జిమ్ వర్కౌట్స్ తో తన రోజు మొదలవుతుంది. ఆ తర్వాత వేడి ఆవిరి పట్టించుకుని.. చల్లనీటితో స్నానం చేయడం క్లార్క్ నిత్య ఉషోదయ జీవితంలో కనిపించే ప్రక్రియ.

పర్పుల్ క్యారెట్లు, బచ్చలికూర, చిలగడదుంపల వరకు ప్రతిరోజూ ఒక పౌండ్ కూరగాయలను తినడం ఈమె ఆహరపు మెనూలో కనిపిస్తాయి. అలాగే, చికెన్, గుడ్లు మాంసం వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్డూ తన మెనూలో ఉంటాయంటోంది. ముఖ్యంగా తన ఆహారంలో ఒమేగా 3, విటమిన్ బి, నికోటినామైడ్ రైబోసైడ్ వంటివి ఉండేలా చూసుకుంటోందట. ఇవన్నీ కూడా దీర్ఘాయుష్షు కోరుకునే వ్యక్తులు తమ మెనూలో ఉండేలా చూసుకునే సప్లిమెంట్స్.

సో మొత్తంగా మొన్నటివరకూ పద్దెనిమిదేళ్ల కుర్రాడిగా ఓ మార్కండేయుడై నిల్చిపోయేందుకు బ్రయాన్ జాన్సన్ ఏకంగా ఏటా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గురించి విన్నాం. 30 మంది వైద్యులతో నిత్యం 111 పిల్స్ మింగే ప్రక్రియ గురించి విన్నాం. 45 ఏళ్ల జాన్సన్ గుండె 37 ఏళ్ల వ్యక్తిలాగా స్పందిస్తోందనీ చదివాం. 45 ఏళ్ల జాన్సన్ ఏకంగా ఐదారేళ్ల చిన్నవాడిలా కనిపిస్తున్నాడనే వార్తలూ చదివాం. ఇదిగో ఇప్పుడు ఆ లిస్టులో జూలీ గిబ్సన్ క్లార్క్ కూడా వచ్చి చేరింది మరి.

(గమనిక:గతంలో రాసిన బ్రయాన్ జాన్సన్ స్టోరీ కూడా ఇదిగో కింద ఇచ్చిన వర్డ్ ప్రెస్ లింక్ ఓపెన్ చేసి చదువొచ్చు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles