వెంకట్రామయ్య గుళ్లపల్లి… ✍🏼
ది బెస్ట్ ఫార్మాట్ ఆఫ్ ది గేమ్, టెస్ట్ క్రికెట్ విన్స్

టెస్ట్ మ్యాచ్ బోరింగ్ కాదు, ఒక అద్భుతం అని నమ్మరు చాలా మంది..
టి20 లా, వన్డేలా రిజల్ట్ ఇదే అనే నిర్ణయానికి రాలేం మనం..
ఈ మ్యాచ్ లో గ్రీన్ పిచ్ చూసి.. ఇంగ్లాండ్ గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు..
ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు 23 పరుగుల లీడ్ చాలా తక్కువ, కనీసం 400 కొడుతుంది అనుకున్నారు..
23 పరుగుల లీడ్ వచ్చాక.. భారత్ కనీసం 400 టార్గెట్ ఇవ్వాలి అనుకున్నారు..
అలానే కనపడింది.. ఆదిలో వికెట్లు కోల్పోయినా.. జైస్వాల్, ఆకాష్ దీప్, జడేజా, సుందర్ బ్యాటింగ్ తో 373 టార్గెట్ ఇచ్చింది..
ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు ఆ స్కోర్ పెద్ద లెక్క కాదు.. చేతిలో రెండు రోజులు ఉంది..
డకేట్, క్రాలీ, పోప్ వికెట్స్ తో ఇంగ్లాండ్ ఓడిపోతుంది అనుకున్నాం..
కానీ, అనూహ్యంగా… బ్రూక్, రూట్ సెంచరీలు, ఇంగ్లాండ్ వైపే మ్యాచ్ వెళ్ళింది..
ఎప్పుడైతే బ్రూక్ వికెట్ పడిందో.. రూట్ ఒత్తిడిలోకి వెళ్ళిపోయాడు..
అక్కడి నుంచి మన బౌలర్ లు చిన్న గ్యాప్ ఇవ్వలేదు..
ఈ మ్యాచ్ కూడా 5 రోజులు జరుగుతుంది అనుకోలేదు.. జరిగింది..
చివరి రోజు వరకు లాగడం మన బౌలర్ లకు రెస్ట్ వచ్చింది..
బాల్ ఇచ్చిన దగ్గరి నుంచి సిరాజ్, ప్రసిద్ ఇద్దరూ చెలరేగిపోయారు.. ఫస్ట్ ఓవర్ లోనే పరుగులు వచ్చాయి..
ఆ తర్వాత ఒక్క సిక్స్ పడింది.. సిరాజ్ బౌలింగ్ కు మైండ్ బ్లాక్..
వోక్స్ బ్యాటింగ్ కు వస్తాడని తెలుసు.. వోక్స్ ను ఒక్క బాల్ కూడా ఆడించాకుండా జాగ్రత్త పడ్డారు..
దాని కంటే ముందు ఓవర్ లో ప్రసిద్ బౌలింగ్ కలిసి వచ్చింది..
షాట్స్ ఆడే ఛాన్స్ ఇవ్వకుండా బౌలింగ్ చేసాడు.. ప్రతీ బాల్ అటికిన్సన్ ఊపాడు.. ఒక్కటి తగలలేదు..
దీనెమ్మ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్ కు ప్రాణం పోసిన మ్యాచ్ ఇది..
ఈ రేంజ్ లో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు అసలు..
అందుకే టెస్ట్ క్రికెట్ సరిగా అర్ధం చేసుకుంటే 5 రోజులూ వినోదం ఉంటుంది.. ప్రతీ సెషన్ బాగుంటుంది..!



