THE REVENANT.. ఓ సర్వైవల్ మూవీ!

వివేక్ లంకమల…

—————————————————-

ఎలా బతకాలి?

ఎలాగోలా బతికెయ్యడమే జీవితేచ్ఛ అయినప్పుడు మనిషి ఎలాగైనా బతక్కగలడు. మనిషే కాదు సృష్టిలో ప్రతి జీవీ ఎలాగోలా బతగ్గలదు.

ఎందుకు బతకాలి అనే ప్రశ్న వస్తేనే సమస్య.

కొందరు లొంగిపోతారు. కొందరు నిలబడతారు. అప్పుడనిపిస్తుంది లొంగదీస్తున్న బలహీనతను జయించడం కోసమే బతుకు. అది మానసిక లొంగుబాటా, శారీరక లొంగుబాటా అనేది మనిషి మనిషికీ మారుతుంది.

మంచు ప్రదేశాల్లో మనిషి తాలూకు సాధారణ భావాలకు తావు ఉండదు.

Call of the Wild లో జాక్ లండన్ చెప్పినా
Dersu Uzala లో అకీరా కురసోవా చూపించినా అంతిమ సారాంశం అదే.

నీ మనుగడే కష్టమైనప్పుడు నీకు ఎదుటివారి భావోద్వేగాలతో సంబంధం ఉండదు.

The Revenant, ఒక సర్వైవల్ మూవీ.

మంచు ప్రదేశంలో ఎలుగుబంటి దాడికి గురవుతాడు Huge Glass. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని వదిలేసి వెళ్లిపోతారు సహచరులంతా. కొడుకూ కళ్ళముందే ప్రాణం వదులుతాడు.

అప్పుడు పుడుతుంది గ్లాస్ కి జీవితేచ్ఛ.

ఎలాగైనా బతకాలి, తననిలా వదిలేసిన వాడిని, కొడుకును చంపిన వాడిని చివరి క్షణం చూడాలని ఒంట్లో ప్రాణం పోతున్న అణువణువుకూ ప్రాణం పోసి వెతుక్కుంటూ బయల్దేరతాడు. అనుకున్నది సాధిస్తాడు కూడా.

కానీ ఎలా..? ప్రాణం పోతుందేమోనన్న ఆలోచన ఎలా ఉంటుంది?

లియోనార్డ్ డికాప్రియో అద్భుతమైన ఆర్టిస్ట్. కనురెప్పలు కదిలించి, మొహం చిట్లించి కూడా భావాలు పలకించగలడు.

అందరూ Titanic అంటారు హీరో కానీ Blood Diamond అంతకు మించినది. అయినా కూడా ఆస్కార్ కోసం The Revenant వరకూ ఎదురు చూడాల్సి వచ్చింది.

సినిమా Hotstar లో ఉంది. The Revenant సినిమా కథ మాత్రమే కాదు Huge Glass అనేది రియల్ లైఫ్ క్యారెక్టర్ అని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles