అది 1987- 88 మధ్యకాలం.. ఆదివారం ఉదయం.. వీధులన్నీ నిర్జీవమైపోయి అప్రకటిత కర్ఫ్యూలా కనిపించేవి. సాధారణంగానే ఆదివారం కావడంతో దుకాణాలు కూడా తెరుచుకోకపోవడంతో పాటు… పిండర్ ఆఫ్ సైలెన్స్ అన్నట్టుగా గల్లీలు దర్శనమిచ్చేవి. అలా అని ప్రతీ 87-88 మధ్య ప్రతీ ఆదివారం బంద్ కాల్స్ ఉన్నాయని కాదు. కానీ, అంతకుమించి జనం అటెన్షన్ ను గ్రాబ్ చేసింది ఓ టీవి సీరియల్. నాటి నుంచి ఇప్పటివరకూ టీవీ, సోషల్, డిజిటల్ మీడియా ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయినా కూడా… ఇప్పటికీ నాటి 87-88 మధ్య కాలం నాటి సీరియల్ దే టీఆర్పీల్లో సింహభాగం. అదే, హైందవ ధర్మంలో మానవుడి జీవితానికి ఆదర్శప్రాయంగా చెప్పుకునే రామాయణం. అసలు దూరదర్శన్ ఛానల్ అతి ఎక్కువ మంది చూడ్డానికి.. అనూహ్యమైన రేటింగ్స్ రావడానికి కారణమైందే రామానందసాగర్ రామాయణ్ అంటే అతిశయోక్తేం కాదు.

1987-88 మధ్య కాలంలోనే ఏకంగా 7 కోట్ల 70 లక్షల మంది రామానందసాగర్ మనసు పెట్టి తీసిన చారిత్రాత్మక టెలీ సీరియల్ రామాయణ్. ఆ రామాయణ్ ఇప్పటికీ ఓ రికార్డ్ గా నిలవడమే ఇప్పుడు మళ్లీ ఆ సీరియల్ గురించి మెమోరైజ్ చేసుకోవడానికి ఓ ప్రధాన కారణం. బిగ్ బాస్ వంటి షోస్, నాగిన్ వంటి సీరియల్స్, స్టాండప్ కమెడీయన్ గా పేరుగాంచిన కపిల్ శర్మ కామెడీ షోస్… ఏవీ కూడా రామానందసాగర్ రాయాయణ్ సీరియల్ ముందు టీఆర్పీల్లో నిలవలేదు. ప్రపంచంలోనే అత్యధికంగా చూడబడ్డ మైథలాజికల్ సీరియల్ గా కూడా రామయణ్ రికార్డులకెక్కి ఓ రికార్డ్ సృష్టించింది.
ఆ రోజుల్లోనే ఒక్కో ఎపిసోడ్ కు 9 లక్షలకు పైగా ఖర్చు పెట్టి తీశారంటే… రామాయణ్ ను నిర్మించే క్రమంలో రామానందసాగర్ తపన, భక్తి, చిత్తశుద్ధి అన్నీ కనిపిస్తాయి. రామాయణానికి మూలమైన వాల్మీకి రామాయణంతో పాటు.. తులసీదాస్ రామచరిత్ మానస్ ప్రభావం ఈ రామాయణ్ సీరియల్ పై అధికంగా కనిపిస్తుంది. మరాఠీలోని భావార్థ్ రామాయణ్, బెంగాలీలోని కృతివాస్ రామాయణ్, తెలుగులోని రంగనాథ రామాయణం, కన్నడంలోని రామచంద్ర చరిత్ పురాణం, మళయాళంలోని ఆధ్యాత్మ రామాయణ్, ఉర్దూలోని చాక్బస్త్ రామాయణం ఇలా ఇన్ని రామాయణాలను శోధించి.. రామాయణ్ సీరియల్ మనసు పెట్టి తీశారు రామానందసాగర్. అందుకే 82 శాతం వీక్షించిన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద గ్రేట్ మైథలాజికల్ సీరియల్ గా.. 20 భాషల్లో 17 దేశాల్లో 5 ఖండాల్లో ప్రదర్శించబడి రామాయణ్ ఇంకే సీరియల్ చెరిపేయలేని రికార్డులను సాధించింది.

భారత్ లో అత్యధికంగా జనాన్ని టీవి సెట్ల ముందు కూర్చోబెట్టిన షో!
లక్ష్మణుడు వర్సెస్ మేఘనాథుడి యుద్ధ ఘట్టం… ఈ సీరియల్ లో హైలెట్. ఈ ఎపిసోడ్.. రేటింగ్స్ ప్రకారం 77 మిలియన్స్ ఇంప్రెషన్స్ ను చూపించడంతో పాటు.. 7 కోట్ల 70 లక్షల మంది వీక్షించారు. ఒక్కో ఎపిసోడ్ కు మొదట చెప్పుకున్నట్టు.. 9 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేస్తే.. రామాయణ్ సీరియల్ కు వచ్చిన రెస్పాన్స్ లో భాగంగా ఒక్కో ఎపిసోడ్ 40 లక్షల రూపాయల పైచిలుకు లాభాల్ని ఆర్జించిపెట్టింది.
నేటి ట్రెండీ సీరియల్స్ నుంచి మొదలకుంటే, ఫ్యామిలీ డ్రామాలను సైతం తోసిరాజని!
మాజీ కేంద్ర మంత్రి స్మృతీఇరానీ ప్రధాన పాత్రలో నటించి.. స్టార్ ప్లస్ లో ప్రసారమైన క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ వంటి కుటుంబ నేపథ్య సీరియల్స్ కూడా మహిళలను టీవీ సెట్లకు కట్టిపడేశాయి. బాలాజీ టెలిఫిల్స్ పేరుతో ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ నిర్మించిన ఈ సీరియల్ ఓ సంచలనమై టీవీ రేటింగ్స్ లో రికార్డుకెక్కినా.. రామాయణ్ రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. అలాగే ఒక బిగ్ బాస్ అయినా, నాగిన్ వంటి సీరియల్సైనా.. ఏ ప్రయోగాలు కూడా రామాయణ్ అనే ఆధ్యాత్మిక సీరియల్ రికార్డ్స్ ను కనీసం టచ్ చేయలేకపోవడం విశేషం.
అందుకే ఎందరో స్టార్ట్స్ తో పాటు… అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడూ.. రామాయణ్ లో రాముడు, సీత పాత్రలు పోషించిన అరుణ్ గోవిల్, దీపికా చికాలియాలకు ప్రత్యేక ఆహ్వానమందించారు. వారు అయోధ్య వేడుకలో ప్రధానాకర్షణై నిలిచిందీ మనం చూసిందే. ఇదండీ ప్రతీ ఆదివారం ఉదయం 35 నిమిషాల పాటు ప్రపంచంలోని ఎందరో వీక్షకుల్ని.. ఏకబిగిన టీవిసెట్ల ముందు కూర్చోబెట్టిన మన రామాయణ్ కథ.. రామానందసాగర్ సృష్టించిన చరిత్ర!



