Mani Bhushan… ✍🏻
——————————————
Think outside the box
జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలో BRS గెలవలేదని KCRకి తెలియదా! నూరు శాతం బరాబర్ తెలుసు.

1983-2025 నడుమ 42 ఏండ్లలో… అధికార పక్షంలో/ అధికారంలో 21 సం.లు; ప్రతిపక్షంలో/ ఉద్యమంలో 21 సం.లు గడిపిన నాయకులు KCR.
తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, అయిదుసాల్రు ఎంపిగా గెలిచి… రెండుసార్లు ఉమ్మడి AP (ఎన్టీఆర్, చంద్రబాబు) క్యాబినెట్లలో మంత్రిగా, డిప్యూటీ స్పీకరుగా, రెండేండ్లు మన్మోహన్ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా, దశాబ్దకాలం తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రిగా బాధ్యతలు మోసిన రాజకీయ వేత్త KCR.
అటువంటి నాయకుడికి ఉపఎన్నికలో political advantage ప్రతిపక్షానికి ఉండదని కచ్చితంగా తెలుసు. గతంలో ఉప ఎన్నికల తీరును break చేశారు కూడా.
కెసిఆర్ ఏలుబడిలో నారాయణఖేడ్, పాలేరు స్థానాలకు ఉప ఎన్నికలొచ్చాయి. ఆ రెండూ కాంగ్రెస్ కంచుకోటలు. ఎన్నికైన కాంగ్ ఎమ్మెల్యేలు చనిపోతే సానుభూతితో వాళ్ల కుటుంబీకులకే కాంగ్రెస్ టికెట్లిచ్చింది. అప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణిస్తే వాళ్ల గౌరవార్థం ఏకగ్రీవ ఎన్నిక జరపాలనే పద్ధతేదో ఉండేది. అమలాపురంలో జి.ఎం.సి.బాలయోగి చనిపోతే అతని భార్య విజయకుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
KCR ఈ convention తోసిపుచ్చి ‘సెంటిమెంట్ లేదు, ఆయింట్మెంట్ లేదు’ అనేశారు. నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో TRS అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపించుకున్నారు కెసిఆర్.
ఇంత రాజకీయం నడిపిన నాయకుడికి జూబిలీ హిల్స్ ఎవరి పరం అవుతుందో గ్రహించలేరా! అందుకే గమ్మున farm houseలో కూర్చున్నారు.
.
——
PS: ఓ సారి చంద్రబాబు హయాంలో… 1998లో సి.హెచ్.విద్యాసాగరరావు (బిజెపి) లోకసభకు నెగ్గడంతో మెట్‌పల్లిలో ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు బిజెపి అభ్యర్థి ఓడిపోగా కొమిరెడ్డి జ్యోతి (కాంగ్రెస్) ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ప్రతి నాయకురాలిని ‘అక్క’ అనడం పరిపాటి. జ్యోతిని 1998లోనే ‘జ్యోతక్క’ అని పిలిచేవారు, పత్రికల్లో రాసేవారు.
.



