ఆస్ట్రేలియాలో… మేడ్ ఇన్ ఇండియా మెట్రో కోచెస్!

మనమేదైనా కాస్ట్లీ వస్తువోటి కొంటే… మొట్టమొదట మేడ్ ఇన్ ఎక్కడ అనేది చూస్తుంటాం. కాస్త టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లైతే… ఒక బ్రాండ్ కు సంబంధించిన టీవీనో, మోబైలో ఫోనో ఏ దేశంలో తయారైందో… దాన్ని బట్టి దానిమీద వారి సంతృప్తి ఆధారపడి ఉంటుంది. అంటే మేడ్ ఇన్ జపాన్ అని ఎక్స్పెక్ట్ చేసిన చోట… తాను ఏరి కోరి తెప్పించుకున్న మోబైల్ ఫోన్ ఏ యూఎస్ఏలోనో తయారైతే… అంత కిక్కివ్వదు. మొత్తానికి ఏ కంపెనీ బ్రాండ్ ఎక్కడ తయారైందనేది ఇంతకాలం చూస్తు వచ్చిన మనకు… మన వస్తువులు ఇతర దేశాల్లో మేడ్ ఇన్ ఇండియా పేరుతో చలామణిలోకి రావడమన్నది మాత్రం ఇప్పుడు యావత్ దేశం గర్వించదగ్గ విషయం.

అదే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక్కటైన ఆస్ట్రేలియాలో అనుభవంలోకొచ్చింది. సిడ్నీ నగరంలో ఇప్పుడు పూర్తిగా డ్రైవర్ లేకుండా నడిచే ఆటోమేటెడ్ రైలు వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే, ఆ మెట్రో ట్రైన్స్ కోచెస్ అన్నీ మేడ్ ఇన్ ఇండియా కావడమూ.. మేక్ ఇన్ ఇండియాకు గర్వకారణమవ్వడమే ఈ స్టోరీ.

పూర్తిగా ఎల్ఈడీ లైట్స్, సీసీ కెమెరాలు, డబుల్ డోర్స్, ప్రయాణ సమయాన్ని, నెక్స్ట్ వచ్చే ఫ్లాట్ఫామ్స్ ను తెలిపే అధునాతన టెక్నాలజీ.. ఇలా పూర్తిగా ఆధునిక ఫీచర్స్ తో ఇండియాలో రూపొందించిన ఈ మెట్రో బోగీలను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయడమంటే సాంకేతికతలో భారత్ మరో మైల్ స్టోన్ సాధించినట్టే.

బీజేపీ అధికారంలోకొచ్చాక మేక్ ఇన్ ఇండియా అనే మోటోకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. దీనిపై అనుకూల ప్రచారమెంతో… సెటైరికల్ గా.. వెటకారంగా కూడా అంతే విమర్శలూ ఎదుర్కొన్న పరిస్థితులను చూశాం. అయితే, ఇప్పుడా విమర్శలకు చెక్ పెట్టేలా… ఆస్ట్రేలియా వంటి దేశంలో సిక్స్ కోచెస్ కల్గిన 22 ట్రైన్స్ ను ఇండియా అందించడం గర్వించే విషయమైతే… అందుకు మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటీ వేదికవ్వడం మరింత ఆనందపర్చే అంశం. శ్రీ సిటీలో అసెంబుల్డైన కోచెస్.. ఇప్పుడు సిడ్నీ మెట్రో లైన్ లో బుల్లెట్ వేగంతో పరిగెత్తేతున్నాయి. 2018లో సిడ్నీ మెట్రో కోసం ఈ కోచుల తయారీని శ్రీ సిటీలో ప్రారంభించారు.

ఎమర్జెన్సీ ఇంటర్ కామ్స్ తో పాటు… అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో స్టేషన్లలో ఆగే సమయపాలన ఇలా అన్నీ వావ్ అనిపించేలా ఈ మెట్రో కోచెస్ మన ఇండియాలో.. అదీ మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలో తయారవ్వడం ఇప్పుడు భారత్ జెండాను బయట రెపరెపలాడించమే!

శ్రీ సిటీ కేంద్రంగా ఈ మెట్రో రైల్వే బోగీలను తయారుచేసిన ఆల్ స్టోమ్ కంపెనీ పత్రికా ప్రకటన ప్రకారం నార్త్ వెస్ట్ రైల్ వింగ్ నుంచి పూర్తిగా కమ్యూనికేషన్స్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) టెక్నాలజీలో అర్బాలిస్ 400 సిగ్నలింగ్ వ్యవస్థతో ఆరు బోగీలతో కూడిన 22 మెట్రో రైల్స్ తయారీతో పాటు… ప్రారంభించిన్నాట్నుంచి 15 ఏళ్ల కాలం పాటు పూర్తిగా మెట్రో ట్రైన్స్ మెయింటైనెన్స్ కాంట్రాక్ట్ బాధ్యత కూడా ఆల్ స్టోమే చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిపార్ట్ మెంటల్ ఆపరేషన్స్ తో పాటు, సిగ్నలింగ్ వ్యవస్థ సమర్థవంతంగా నడిచేలా చూడటం అందులో ప్రధాన బాధ్యత. బెంగళూర్ కేంద్రంగా ఉన్న ఆల్ స్టోమ్ ఫర్మ్… బిడ్ ద్వారా ఈ సిడ్నీ మెట్రోపోలిస్ కాంట్రాక్ట్ ను దక్కించుకుంది.

అయితే ఇప్పుడు డ్రైవర్ లేకుండా నడిచే ఆటోమేటెడ్ మెట్రో రైలు పారిస్, ఆమ్స్టర్డామ్, బార్సిలోనా, సింగపూర్ తర్వాత జాబితాలో.. ఇప్పుడు సిడ్నీ నగరం పేరు కూడా చేరింది. దశలవారీగా ఈ మెట్రోట్రైన్ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఆల్ స్టోమ్ ఆసియా-పసిఫిక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లింగ్ ఫాంగ్ కూడా వెల్లడించిన పరిస్థితి. మొత్తంగా ఆస్ట్రేలియా వంటి దేశంలో… సిడ్నీ వంటి నగరంలో నడిచే డ్రైవర్ లెస్ మెట్రో ఆటోమేటెడ్ ట్రైన్స్ తయారీ కేంద్రం భారత్… అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ కావడం ఇప్పుడు కచ్చితంగా… మేక్ ఇన్ ఇండియా కల సాకారంలో ఓ గొప్ప ముందడుగు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles