భారత్ పై విదేశీ మీడియా విషం! చర్చగా మారిన మరో విదేశీయుడి విశ్లేషణ!!

గతంలో అది దూరదర్శన్ అయినా.. రేడియో అయినా… లేదా ఓ ప్రధాన పత్రికైనా.. మీడియాలో ఏదైనా వచ్చిదంటే ఓహో అలా జరిగిందా అనే వార్త జనానికి తెలిసేది. నాటి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల విశ్వసనీయతను చూరగొన్నాయి. కానీ, ఎప్పుడైతే మీడియా విస్తరించిందో అది సన్నగిల్లింది. దానికి తోడు.. మన సంస్కరణలు కల్పించిన అవకాశాలతో విదేశీ మూలాలున్న వారూ మన మీడియాలోకి చొరబడ్డారు. విదేశీ మీడియానే ఎకంగా ఇండియాలో వేళ్లూనుకుంది. పైగా మససులో అనుకుంటే చాలు సోషల్ మీడియాకెక్కేంత వడివడిగా వార్తలు వైరలవతున్నాయి. ఈ క్రమంలో విదేశీ మీడియా కథనాలు.. రాజకీయ పార్టీలు.. నాయకుల తీరుపై పక్షపాత వైఖరితో కనిపించడం.. ఇప్పుుడ ఓ బిగ్ డిబేట్ కు దారితీస్తోంది.

మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీని ఎన్నుకోవడం విషయంలో.. భారతీయులంతా బాగా ఆలోచించాలన్నట్టుగా ప్రముఖ పత్రిక ది గార్డియెన్ పేర్కొనడం.. నిక్కచ్చిగా పక్షపాత వైఖరే. విదేశీ మీడియా తమకిష్టమైన చందంగా వార్తలను వండివారుస్తూ భారత్ లోని జనంలోకి జొప్పిస్తూ… తాము రాజకీయాలను శాసించేలా ఎడిటోరియల్ కామెంట్స్ చేస్తుండటంపై పలువురు మండిపడుతున్నారు.

క్రిస్ బ్లాక్ బర్న్ అనే రాజకీయ విశ్లేషకుడు… ది గార్డియన్ కథనాలపై చాలా సీరియస్ గా స్పందించాడు రెండు దశాబ్దాలకుపైగా దక్షిణాసియాలో పనిచేసి.. యూఎస్ ఆధారిత గ్లోబల్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న బ్లాక్ బర్న్.. యూకే బేస్డ్ దినపత్రికైన ది గార్డియన్ లో నిర్మొహమాటంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన వార్తాకథనం… మరో ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు నేరుగా పిలుపిచ్చినట్టేనంటున్నారు.

ఇలాంటి వండివార్చే కథనాల వల్ల… దేశం కాని దేశంలో ప్రభుత్వాలను మార్చేలా జనాన్ని ప్రభావితం చేసే ఎడిటోరియల్స్ వల్ల.. విదేశీ మీడియా విశ్వసనీయతను కోల్పోతోంది. ఇది విదేశీ మూలాలున్న మీడియా సంస్థలకే కాకుండా… కచ్చితంగా అందులో పనిచేస్తున్న కరస్పాండెంట్స్ పైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి నిష్పక్షపాత జర్నలిజం కోసం ఇప్పుడు ఆయా విదేశీ మూలాలున్న మీడియా సంస్థల్లో పనిచేస్తున్న సంపాదకుల నుంచి రిపోర్టర్స్ వరకూ జర్నలిస్టులంతా నినదించాల్సిన సమయం.. తమ ఉనికిని కాపాడుకోవాల్సిన తరుణమంటూ గురువారం రోజు డైలీ ఎక్స్ ప్రెస్ లో రాసుకొచ్చారు బ్లాక్ బర్న్.

ఈ తరహా సంచలనాత్మక కథనాలు.. కేవలం, భారత్ లో సంకుచిత ధోరణులు పెరుగుతున్నాయన్న ఓ ప్రచారాన్ని ప్రపంచం ముందుంచే ఓ ప్రయత్నమని.. ఇదే మూస పక్షపాత ధోరణులు అవలంబిస్తూ.. వక్రీకరణలు చేయడం వల్ల నాన్నా పులి కథలే పుట్టుకొస్తాయన్నట్టుగా ఆయన కథనం సాగింది.

దాదాపు దశాబ్దకాలంగా ప్రధాని మోడీ హయాంలో భారతదేశం ప్రజాస్వామ్య స్వరూపాన్నే కోల్పోయినట్టు.. 2024లో మళ్లీ మోడీ గెలిస్తే నియంతృత్వం వైపు అడుగులు తప్పవన్నట్టుగా చూపించే ప్రయత్నం ది గార్డియన్ కథనంలో కనిపిస్తోందన్నారు బ్లాక్ బర్న్. పైగా సృజనాత్మకతలో పోటీ తత్వం లేదని.. దేశంలోని అన్ని వర్గాల పౌరుల పట్ల సమానత్వం కూడా లోపించిందన్నట్టుగా ది గార్డియన్ వార్తా కథనం పేర్కొంది.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం.. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా జరిగిన అరెస్టుల పర్వంలో అంతా ప్రతిపక్ష నాయకులవ్వడం.. ఎవ్వరూ అధికారపార్టీకి చెందినవారు లేకపోవడం వంటివెన్నో పేర్కొంటూ గార్డియన్ ఇండియాలో మోడీ గవర్నెన్స్ పై ఏకంగా అటాక్ మొదలుపెట్టిందన్నది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్న మాట.

కొన్ని దేశాల విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టేందుకు… బ్రిటీష్ దినపత్రిక పాకిస్థాన్ ఇంటలిజెన్స్ పై ఎలా ఆధారపడిందో కూడా హైలెట్ చేసిన బ్లాక్ బర్న్.. విశ్వసనీయత విషయంలో నక్కకూ నాకలోకానికున్నంత తేడా కల్గిన పాకిస్థాన్ ఆరోపణలను బేస్ చేసుకుని కథనాలు రాయడం.. అది జర్నలిజం విలువలకే మచ్చ అని పేర్కొన్నారు. గత ఏప్రిల్ లో పాక్ లో విడుదలైన ఇంటలిజెన్స్ అధికారుల నివేదికను ఆధారంగా చేసుకుని కథనాలు రాయడమేంటని బ్లాక్ బర్న్ ప్రశ్నిస్తున్నారు.

ఒక పక్షపాత వైఖరితో ప్రాశ్చాత్య మీడియా వ్యవహరిస్తోందని.. భారత్ వంటి దేశాల్లోని ప్రజల ఆసక్తులు, భౌగోళిక, రాజకీయ అంశాలను బేస్ చేసుకుని.. తమ వక్రీకరణల కవరేజ్ తో ప్రభావితం చేద్దామనే ఓ అంతరార్థం కనిపిస్తోందన్నది బ్లాక్ బర్న్ ఆరోపణ.

మరో సంఘటనను కూడా బ్లాక్ బర్న్ తన కాలమ్ చర్చించారు. అమానా బేగం అన్సారీ అనే ది ప్రింట్ కాలమిస్ట్.. బీబీసీతో మాట్లాడుతున్నప్పుడు.. వైవిధ్యానికి కేరాఫ్ గా చెప్పుకునే ఇండియాలో… ఆ వైవిధ్యంలో ముస్లిం మైనార్టీస్ కు జాగా ఎక్కడుందన్నదే ఇప్పుడు తనను కలవరపెడుతున్న అంశమని పేర్కొనడాన్నీ ఆయన వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఏబీసీలో పనిచేసే ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అవనీ డయాస్ భారత్ వదిలి వెళ్లిపోవడంపైన కూడా దుష్ప్రచారం చేశారని.. కానీ, ఆ తర్వాత తాను స్వచ్ఛందంగా వెళ్లిపోయినట్టు తేలిందన్నదీ ఆయన గుర్తు చేస్తూ.. ఇలాంటి ఎన్నో వక్రీకరణలు భారతీయులకు విదేశీ మీడియాను దూరం చేసే పరిణామాలకు కారణాలన్నారు.

భారత్ లో ఉన్న సంక్షిష్ఠతలను సరిగ్గా అర్థం చేసుకోవడం.. విభిన్న స్వరాలను వినడం… ముందుగా పాశ్చాత్య జర్నలిస్టులు చేయాల్సిన పని. ఆ తర్వాతే భారతదేశాన్ని పారదర్శకంగా ప్రపంచ వేదికపై చూపించగలరని.. అంతరదృష్టితో చూసి అర్థం చేసుకుని రిపోర్ట్ చేయాల్సిన వాటిని వక్రీకరిస్తే.. విదేశీ మీడియా కచ్చితంగా రానున్న రోజుల్లో విశ్వసనీయతను మరింత కోల్పోవడం ఖాయమంటారు బ్లాక్ బర్న్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles