వెంకట్రామయ్య గుళ్ళపల్లి…✍🏻
సెంచరీలో కనుమరుగైపోయాడు కదా…? డౌట్ ఏం ఉంది అదే నిజం!
మళ్ళీ నితీష్‌ను ఏదో తక్కువ చేసా అంటారేమో…?
నితీష్ హిస్టారిక్ సెంచరీ వెనుక ఓ సొగసైన డిపెండబుల్ బ్యాటింగ్ ఉందని ఎంత మంది అబ్జర్వ్ చేసారు…?
వాషింగ్టన్ సుందర్… ది క్లాసీ లెఫ్ట్ హ్యాండర్… జేపీ డుమినీని ప్రతీ బాల్‌లో చూసాను!
టెస్ట్ క్రికెట్‌లో దమ్మున్నవాడే ఆడాలి… ఆ దమ్ముకు టెక్నిక్ తోడైతే సుందర్!
162 బంతులు ఆడాడు.. అవుటైన బాల్ తీసేస్తే 161… అందులో ఒకటే ఫోర్!

టీ20 ఫార్మాట్ అలవాటైన వాళ్ళకు వీడేం సోది అనుకునే ఉంటారు కదా…? హవ్వా.. 30 స్ట్రైక్ రేటా…?
గోడ కడుతున్నాడని అర్ధమయ్యేలోపు ఆస్ట్రేలియా బౌలర్లు అలసిపోయారు.
ఆ హైట్ మీద అంత అందంగా ఎలా ఆడాడో మరి…? డిఫెన్స్‌లో సింగిల్ మిస్టేక్ లేదు… కొత్త బాల్ భలే కంట్రోల్ చేసాడు.
90 ఓవర్ల వరకూ కేవలం మూడు ఓవర్లు వేసిన మిచ్ మార్ష్… ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చాడు.
నితీష్ టార్గెట్ కాదు వాళ్ళకు… సుందర్! సుందర్ సపోర్ట్ చేస్తే నితీష్ నిలబడతాడేమోననే భయం!!
భయాన్ని నిజం చేసి… ఆస్ట్రేలియా బౌలర్లను పిండేసాడు… కొత్త బాల్‌తో అవుట్ అవుతాడేమో అని ఓ చిన్న ఆశ!
లక్కీగా స్టార్క్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ బాల్ ఒకటి ఎవడికీ అర్ధం కాకుండా ఎడ్జ్ అయింది.
అప్పుడు స్కోర్ 18! స్మిత్‌కు స్లిప్‌లో ఏం అర్ధం కాలేదు… లైఫ్ కాదది!
అక్కడి నుంచి విశ్వరూపం… షార్ట్ పిచ్ బాల్స్, ఫుల్ లెంగ్త్ డెలివరీ, యార్కర్లు, ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్… ఎడ్జ్ అవుతాయేమోనని విసిరి విసిరి అలసిపోయారు.
మార్ష్‌కు బాల్ ఇస్తే… టీ బ్రేక్ తర్వాత ఫస్ట్ ఓవర్… అన్నీ ఆఫ్ సైడే… ఒక్క బాలైనా ఆడకపోతాడా అని!
మీ ఇష్టంరా విసురుకోండని వదిలేసాడు… 161 బాల్స్‌లో 42% పర్సంట్ బ్యాట్ వాడనేలేదు.
షార్ట్ పిచ్ బాల్స్ 76% వదిలేసాడు… 143వ బాల్, బోలాండ్ బౌలింగ్‌లో… బ్యూటి లీవ్ అది! కుదిరితే చూడండి!!
బాడీకి తగిలినా పర్వాలేదనుకున్నాడు గానీ.. బ్యాట్‌కు మాత్రం తగలొద్దనుకున్నాడు!
లెఫ్ట్ హ్యాండర్ షార్ట్ పిచ్ బాల్ చూస్తే టెంప్ట్ అయిపోతాడు… ఎక్కడా అవ్వలేదసలు!
ఆ ఒక్క ఫోర్ కూడా నమ్మకంగా గ్యాప్‌లో ఆడాడు… కంటికి, చేతికి కోఆర్డినేషన్ మాత్రం వేరే లెవల్!
2,3 ఇలా ఎన్నో తిరిగాడు… నితీష్‌తో కో ఆర్డినేషన్ ఎంతో అధ్భుతం… రన్ వస్తుందనుకుంటేనే టెంప్ట్ అయ్యాడు.
కొన్నిసార్లు రన్ తీయాలనుకున్నా… మూమెంట్ ఇచ్చి వెనక్కు వెళ్ళిపోయాడేగానీ.. స్ట్రైక్ కోసం కక్కుర్తి పడలేదు!
రన్ కోసమో, బౌండరీ కోసమో కంగారు పడి షాట్ ఆడలేదసలు!
స్టార్క్, కమ్మిన్స్, బోలాండ్… సుందర్‌ను ఆర్డినరీ బ్యాట్స్‌మెన్ అనుకున్నారు.
పాయింట్‌లో, కవర్, ఎక్స్‌ట్రా కవర్ ఇలా కంటిన్యూగా ఫీల్డర్‌లను ఉంచాడు.
థర్డ్ మెన్, ఫైన్ లెగ్ ఫీల్డర్లను పెట్టి షార్ట్ పిచ్ బాల్స్ వేయించాడు, వేసాడు.
కాని టెంప్ట్ అవ్వలేదు… గ్యాప్‌లోనే ప్రిఫర్ చేసాడు… అంత పెద్ద గ్రౌండ్‌లో బౌండరీల కంటే… 2,3 బెటర్ అనుకున్నాడు.
అందుకే నితీష్ షాట్స్ ఆడినా సుందర్ మాత్రం ఆడలేదు… అందమైన టిక్నిక్!
నిలబడితే పరుగులు అవే వస్తాయి… అందుకే 40 పరుగులు చేయడానికి 120 బంతులు ఆడాడు… మిగిలిన పది పరుగులకి 26 బాల్స్!
నితీష్‌కు ఈ సపోర్ట్ దొరకకే ఇప్పటి వరకూ 40లు చేసాడు… నితీష్ లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి!
షైన్ చేస్తే ఇంకో 10 ఏళ్ళు చూసుకునే పనిలేదు… ఆ పిచ్‌ల మీద రియల్ టెస్ట్ క్రికెట్ ఆడాడు.
సెంచరీతో సమానమైన ఇన్నింగ్స్… కాన్ఫిడెన్స్ లెవల్స్ అదుర్స్! అది చూసే ఆస్ట్రేలియా బౌలర్లు ఫ్రస్ట్రేట్ అయిపోయారు!
ఆల్ ది బెస్ట్ వాషి…!



