ఇండియా టుడే కాంక్లేవ్ లో చరిత్ర పుస్తకాల దుమ్ము దులిపేశాడు!

చరిత్రలోని_అబద్ధాలను_వెలికితీస్తున్న_యోధుడు!!

Ganesh Thota…✍🏻

వామపక్ష చరిత్రకారులు పిల్లల పాఠ్యపుస్తకాలలో వక్రీకరించిన చరిత్రపై సాక్ష్యాధారాలతో బట్టబయలు చేసిన ఆధునిక చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్.

ఇంతకీ ఎవరీ డాక్టర్ విక్రమ్ సంపత్? ఇతను బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ లో డిగ్రీ,మాస్టర్స్ చేసి ముంబై జైన్ ఇన్స్టిట్యూట్ లో MBA చేసి,ఆస్ట్రేలియాలో చరిత్ర కోర్సులు చదివే రెండో ముఖ్యమైన క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీలో హిస్టరీ మరియు మ్యూజిక్ లో డాక్టరేట్ చేశాడు.

ఇతను భారత్ లో మొట్టమొదటి సారిగా భారతీయ అతి ప్రాచీన సంగీతం యొక్క డిజిటల్ మ్యూజిక్ ఆర్కైవ్ ప్రారంభించారు.

ఇప్పటికి 4 పుస్తకాలు రాశారు.

1).మైసూర్ వడయార్ రాజుల చరిత్ర,

2)గౌహర్ జాన్( భారత్ లో సంగీతం మొదటి సరిగా గ్రామ్ ఫోన్ లోకి తీసుకువెళ్లిన వారు) చరిత్ర, 3)బాలచందర్ వైణిక విద్వాంసుని చరిత్ర,

4) వీర సావర్కర్ చరిత్ర రెండు పెద్ద భాగాలుగా రాశారు.

గతవారం ఇండియా టుడే కాన్క్లేవ్‌లో డాక్టర్ శశిథరూర్, సర్దేశాయిరాజ్‌దీప్‌తో డాక్టర్ విక్రమ్ సంపత్ చర్చలో పేర్కొన్న విషయాలు అంటే పిల్లల చరిత్ర పాఠ్యపుస్తకాలలో భారత్ ని వేల సం.లు పాలించిన హిందూరాజుల చరిత్ర గురించి కేవలం అతి తక్కువ స్థలం కేటాయించి,

300 సం.లు పాలించిన మొఘల్ రాజుల పాలన గురించి చాలా ఎక్కువ ప్రస్తావించారని శశిథరూర్ కామెంట్ కి జవాబుగా చెప్పారు.

ఆ వీడియో బాగా వైరలయ్యి సంపత్ వార్తలలోకి వచ్చాడు.

ఈయన చెప్పిన విషయాలను జీర్ణించుకోలేని వామపక్ష ప్రొఫెషనల్ చరిత్రకారులు అంటే #ఇర్ఫాన్_హబిబ్ మరియు కొంతమంది వారి వెర్రి అనుచరుల బటాలియన్ డాక్టర్ సంపత్ ని అతని రీసెర్చ్ వర్క్ని విమర్శించడం ప్రారంభించారు.

ఈయన చెప్పినవి అబద్ధాలు అని నిరూపించడానికి NCERT పుస్తకాలలో కొన్ని ఎంపిక స్క్రీన్‌షాట్‌లు మాత్రమే పెట్టారు.

వారి దగ్గర జవాబు లేనప్పుడు ఇది సాధారణంగా వారు అనుసరించే మోసపూరిత విధానం.

ఈ కాలంలో అందరూ అనుసరించే సోషల్ మీడియాలోనే ఈ వామపక్ష చరిత్రకారులు ఇంత నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారంటే వీరు అప్పట్లో ఎవరికో కానీ అందుబాటులో లేని చరిత్ర పుస్తకాలలో ఎన్ని అబద్ధాలు ఇరికించి వుంటారో వూహించండి.

ఇంటర్ నెట్ వచ్చాక ఈ వామపక్ష చరిత్రకారుల ముసుగులు తొలగిపోతున్నాయి.

వీరు చరిత్రకారుల పేరుతో ఈదేశ సంస్కృతికి చేసిన హాని బయటపడుతోంది.సరే! ఎవరు చెప్పింది నిజం?

పిల్లల పాఠ్యపుస్తకాలలో సంపత్ చెప్పినట్లు వామపక్ష చరిత్రకారులు మొఘల్ రాజుల చరిత్రకు ఎక్కువ పేజీలు కేటాయించి హిందూరాజుల చరిత్రకు నామ మాత్రపు పేజీలు కేటాయించారా? చూద్దాం..

#డాక్టర్_విక్రమ్_సంపత్_వివరణ_ప్రకారం.

డాక్టర్ సంపత్ చెప్పిన వాటి మీద అనుమానం వున్నవారు NCERT పుస్తకాలు ఈ క్రింది లింకుల నుండి డౌన్ లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.

Class 6: https://t.co/UzlAoZ2GvT

Class 7: https://t.co/hVXMjSZ9mW

Class 8: https://t.co/cuy3AsEJ3Q

ఉదాహరణలు చదవండి:

1)7వ తరగతి పాఠ్యపుస్తకంలో 2వ చాప్టర్ 16పేజీ లో కేవలం ఒక మ్యాప్ ఉంది.

ఇది రాష్ట్రకూటులు, పాండ్యాలు మొదలైన దక్షిణ రాజవంశాల పేర్లను మాత్రమే పేర్కొంటుంది.

కొన్నిటిని హిరణ్యగర్భ పురాణాలుగా పేర్కొంటూ రాష్ట్రకూటులును వారి బ్రాహ్మణపూజారులు మూర్ఖులుగా చిత్రీకరించారు.

అదే చాప్టర్లో చోళులు 400 రకాల అణిచివేత పన్నుల విధానం (జిజియ పన్ను గురించి ఇలా చిత్రీకరించ లేదు) రాస్తూ మొత్తం చోళుల పాలన 3పేజీలకు కుదించారు.

అంతేకాక అదే చాప్టర్ లో మహమ్మద్ గజనీ ఇక్కడ ప్రజల గురించి మరింత తెలుసుకోడానికే అల్బురిని చరిత్ర రాయడానికి తీసుకువచ్చాడని వివరంగా రాశారు.

కానీ,ఢిల్లీ మొఘల్ పాలకుల చరిత్రకు మొత్తం 3వ చాప్టర్ అంతా కేటాయించారు.

అదే సంపత్ చర్చలో చెప్పాడు.

ఈ ఢిల్లీపాలకుల చరిత్రకిచ్చిన ప్రాధాన్యత దక్షిణ,తూర్పు,పశ్చిమ,ఈశాన్యప్రాంతాల రాజుల చరిత్రకు పాఠ్యపుస్తకాలలో స్థానం ఇవ్వలేదు.

2. ఇదే పుస్తకంలో 4వ చాప్టర్ పూర్తిగా మొఘల్ ఎంపైర్ గురించి వివరించగా,5వ చాప్టర్ వారి పాలనలో నిర్మించబడ్డ నిర్మాణాలు,కట్టడాలు గురించి వివరించ బడింది. (దీనివల్లే ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ దేవాలయాలు,కట్టడాల గురించి మా తరానికి & నేటితరం పిల్లలకు గానీ తెలియదు).

కానీ మొఘల్ రాజులు గురించి ఇంతగొప్పగా రాసిన వామపక్ష మేధావులు వారి క్రూరమైన పాలన అంటే అకృత్యాలు,దోపిడీలు,దేవాలయాల విధ్వంసాలు గురించి జాగ్రత్తగా దాచిపెట్టేశారు.

అంటే ఇది ఉద్దేశపూర్వంగా జరగకుండా వుందంటే నమ్మశక్యంగా వుందా..?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles