హీరో
……………………………………………………………………………………………….
Siva Racharla.. ✍️
ఎన్నికల ఫలితాలను అంచనా వేయటం ఒక సైన్స్ దాన్ని Psephology అంటారు. సెఫాలజీ అనే జోతిష్యం కాదు గుడ్డివాటంగా చెప్పటం కాదు ..
కఠోర శ్రమ చెయ్యాలి అనుభవం ఉండాలి అన్నిటినీ మించి geopolitical knowledge ఉండాలి ..

ఈ దేశంలో ఎన్నికల ఫలితాల మీద నికార్సుగా పనిచేసే సంస్థలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు అందులో Axis My India మొదటిది ,C Voter మరొకటిది. మా అంచనాలు నిజమయ్యాయి అని చెప్పుకోవాలంటే ముందు longevity ఉండాలి. ఒక సంస్థ అంచనాలను పరిగణించాలంటే ఆ సంస్థ లేక దాని బాధ్యుడు ఎన్ని సంవత్సరాలుగా ఎన్నికల ఫలితాల మీద పనిచేస్తున్నారు ఎన్ని ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు అనేది ముఖ్యమైన పెరామీటర్ ..
నేను 2014 నుంచి 2017 వరకు 11 ఎన్నికల అంచనాలను పేస్ బుక్ లో రాసాను .. ఒక్క ఉత్తర ప్రదేశ్ తప్ప మిగిలిన 10 నిజమయ్యాయి. 2014 ఆంధ్రా ఎన్నికలు,2015 ఢిల్లీ & బీహార్ ఎన్నికలు మరియు 2016 తమిళనాడు ఎన్నికలు ప్రధాన సంస్థల అంచనాలకు భిన్నంగా నా అంచనాలు నిజమయ్యాయి. 2015 బీహార్ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్ గురించి ముందే రాశాను .. మొదటి గంట బీజేపీకి అనుకూలంగా ఉంటుంది 9:30 తరువాత RJD -జేడీయూ – కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా మారుతుందని రాశాను .. అదే జరిగింది .. NDTV 12 గంటల వరకు కూడా వరకు బీజేపీనే గెలుస్తుందని చెప్పి ..పొరపాటు జరిగింది అని పేక్షకులకు క్షమాపణ చెప్పి డేటా ఏజెన్సీ మీద కేసు కూడా పెట్టింది..
నా అంచనాలకు బలం జియో పాలిటిక్స్ తెలియటం. ప్రతిరోజూ పొలిటికల్ పరిణామాలను ఫాలో కావటం.. ఎన్నికలు వస్తున్నాయంటే కనీసం నెల ముందు నుంచే దాని మీద రోజుకు 5-6 గంటలు దాని మీద పనిచేయటం.. వీటిని మించి నెట్వర్క్ & మీడియా కనెక్షన్స్ .

2019 నుంచి గ్రౌండ్ లో పనిచేస్తున్నాను ,కమిట్మెంట్స్ వలన బహిరంగంగా రాయకపోయినా నా టీమ్ మరియు మరో 20 – 25 మంది మితులకు నా అంచనాలను చెబుతాను .మొన్న 06/02/2025 న “ఢిల్లీ ఎన్నికల మీద వ్యక్తిగతంగా ఎలాంటి అంచనాలు లేవు…కానీ Axis My India exit polls ను నమ్ముతాను” అని పోస్ట్ పెట్టాను.
అంచనాలు నిజం అయినా ఫెయిల్ అయినా continuity and stability ముఖ్యం.. ఈ కారణంతోనే Axis My India తిరుగులేని సంస్థగా ఎదిగింది.. 2024 లోక్ సభ ఎన్నికల్లో Axis My India అంచనా వేసినట్లు బీజేపీకి 300+ రాకున్నా హర్యానాలో కాంగ్రెస్ గెలవకున్నా Axis My India – ప్రదీప్ గుప్త క్రెడియబిలిటీ దెబ్బతినకపోవటానికి కారణం ఆయన కమిట్మెంట్.. హర్యానా తరువాత మహారాష్ట్ర ,జార్ఖండ్ & ఢిల్లీ ఎన్నికల ఫలితాల 100% నిజం అయ్యింది కేవలం Axis My Indiaవి మాత్రమే..
నిన్నటి డిల్లీ ఫలితాలలో బీజేపీ 45-55 సీట్లతో గెలుస్తుందని Axis My India అంచనా వేసింది..అదే జరిగింది,బీజేపీ 48 సీట్లు గెలిచింది.
Pradeep Gupta is the champion of Indian Psephology, congrats sir.



