కేజ్రీవాల్ నే ఊడ్చేశాడు! ఎవరా పర్వేష్..?

2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఓడగొట్టి… ఇప్పుడు వార్తల్లోకెక్కారు పర్వేష్ వర్మ. అంతేకాదు, ఢిల్లీ తదుపరి బీజేపీ ముఖ్యమంత్రి రేసులో కూడా ఈయన పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఎవరీ పర్వేష్ వర్మ..?

పర్వేష్ వర్మ ఎవరు?

1977, నవంబర్ 7న జన్మించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మది ప్రభావవంతమైన రాజకీయ కుటుంబం. పశ్చిమ ఢిల్లీ నుంచి రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెల్చి భారత రాజకీయాల్లో బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బీజేపీ అధిష్ఠానం గుడ్ లుక్స్ లో ఉండటంతో ఇప్పుడు పర్వేష్ వర్మ పేరు ముఖ్యమంత్రి రేసులో ఉంది.

ఢిళ్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్… ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ నుంచి కీలకపాత్ర వహిస్తున్న నాయకుడు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పర్వేష్ కు ఓ సోదరుడితో పాటు, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన పర్వేష్.. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కిరోరీ మాల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పట్టా పొందాడు. ఆ తర్వాత ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెట్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితానికి నాంది1

వర్మ రాజకీయ జీవితం 2013లో మెహ్రౌలి నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు ఎన్నికవ్వడంతో ప్రారంభమైంది. 2014లో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లోనూ తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పుడు తాజాగా 2025లో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ నే ఓడగొట్టి మరోసారి వార్తల్లోకెక్కాడు. ఆర్థిక కమిటీ, అంచనాల కమిటీతో సహా.. పలు పార్లమెంటరీ కమిటీల్లో పనిచేసిన అనుభవజ్ఞుడు.

రాజకీయాల్లోకి రాకముందు ఉద్యోగ జీవితం!

రాజకీయాల్లోకి రాకముందు పర్వేష్ వర్మ తన ఎంబీఏ పూర్తయ్యాక.. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నాడు. కానీ, తన తండ్రి రాజకీయ వారసత్వంతో ప్రేరణ పొంది రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.

​పర్వేష్ వర్మ రాజకీయ కుటుంబం నుంచే వచ్చిన స్వాతి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. తన సహచరిణి బీజేపీ నాయకుడు విక్రమ్ వర్మ కుమార్తె. పర్వేష్ కు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు సనిధిసింగ్, ప్రిషాసింగ్ తో పాటు.. శివన్ సింగ్ అనే కుమారుడున్నాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను ఐదుగురు పిల్లల్ని కనాలని కోరుకున్నట్టు చెప్పుకొచ్చాడు పర్వేష్. ఆ విషయాన్ని తన భార్యకూ చెప్పానని.. కానీ, వైద్యుల సలహా మేరకు కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా ఆ యోచన మానుకున్నట్టు చెప్పారాయన.

పర్వేష్ వర్మది ధనికుల కుటుంబం. తన ఎన్నికల అఫడవిట్ లో తన వ్యక్తిగత ఆస్తుల వివరాలను వెల్లడించిన పర్వేష్… 89 కోట్ల రూపాయల నికర ఆస్తులు తన పేరిట.. అలాగే, తన భార్య స్వాతిసింగ్ పేరిట మరో 24 కోట్ల 40 లక్షలు.. మొత్తంగా 113 కోట్ల రూపాయల విలువ ఆస్తులు కల్గి ఉన్నట్టు వెల్లడించాడు.

పర్వేష్ కు హైప్రొఫైల్ కార్లంటే ఇష్టం. ఆ కార్లలో టయోటా ఫార్చునర్, టయోటా ఇన్నోవా, మహీంద్రా XUV9 వంటివి ఉన్నాయి.

మొత్తంగా మూడుసార్లు న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తిరుగులేని శక్తిలా గెల్చి హ్యాట్రిక్ సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనతో భారత రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పైన 4 వేల 89 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇప్పుడు పర్వేష్ ఎవరనే ఒక క్యూరియాసిటీని ఇప్పుడు భారత రాజకీయాల్లో రగిలించాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles