లైఫ్ టైం ఎయిర్ పాస్ తో… ప్రపంచాన్నే చుట్టివచ్చాడు! కానీ, ఇప్పుడా పాస్ రద్దైంది.. ఎందుకు?

అతడికి విమానాశ్రయం ఓ ఆట స్థలం. అమెరికన్ ఎయిర్ లైన్స్ ఓ రెండో ఇల్లు. ఆ విషయాన్ని ఓసారి తన కూతురితోనే చెప్పాడు. తన జీవిత కాలంలో కోట్ల కిలోమీటర్లు గాల్లోనే తిరిగాడు. ఇంట్లోవాళ్లు ఉదయం లేచేసరికి బయటకెళ్లి… వారు పడుకునే లోపు ఇతర ప్రాంతాలను చుట్టి వచ్చిన దాఖలాలూ ఉన్నాయి. ఇంతకీ ఆ ఎయిర్ మ్యాన్ ఎవరు..?

స్టీవెన్ రోత్ స్టీన్.. ఇతను అమెరికన్ ఎయిర్ లైన్స్ లో తన జీవితకాలం ఎక్కడికైనా ప్రయాణించేలా విమాన టిక్కెట్ ను కొనుగోలు చేశాడు. దశాబ్దాల పాటు విమానంలో ఎప్పుడంటే అప్పుడు ప్రయాణించాడు. ఫ్లైట్ జర్నీ రోత్ స్టీన్ కు జస్ట్ ఓ ప్రయాణమే కాదు.. అదో పెనవేసుకుపోయిన అనుభవం.

షికాగోకు చెందిన ఈ స్టాక్ బ్రోకర్ రోత్ స్టీన్… 1987లో 2 లక్షల 50 వేల అమెరికన్ డాలర్స్ తో లైఫ్ టైం ఫ్లైట్ టిక్కెట్ కొనుగోలు చేశాడు. ఈ టిక్కెట్ ను అప్పుడు అమెరికన్ ఎయిర్ లైన్స్ ఆఫర్ చేసింది. ఈ ఎయిర్ పాస్ తీసుకుంటే జీవితకాలం ఫస్ట్ క్లాస్ కోచ్ లో.. ఎప్పుడైనా, ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది ఆ సంస్థ.

రోత్ స్టీన్ ఎంతగా ప్రయాణించేవాడంటే.. ప్రయాణాలు అతడి జీవితంలో నిత్యకృత్యమయ్యాయి. బస్సెక్కినంత సర్వసాధారణంగా ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయేవాడు. కొన్నిసార్లు రోత్ స్టీన్ ఏ దేశంలో ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు అతడి కార్యాలయానికి ఫోన్ చేసి తెలుసుకునేవారు. అలా ఏళ్ల కాలంలో కోట్ల కిలోమీటర్ల దూరం గాల్లోనే ప్రయాణించాడు. అమెరికన్ ఎయిర్ లైన్స్ చరిత్రలోనే అత్యంత ఎక్కువగా, తరచుగా ప్రయాణించే ప్రయాణీకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు.

అమెరికన్ ఎయిర్ లైన్స్ లైఫ్ టైం పాస్ రోత్ స్టీన్ జీవన విధానాన్నే మార్చేసింది. విమానాల్లో, విమానాశ్రయాల్లోనే అతడి కమ్యూనికేషన్స్ పెద్ద నెట్వర్క్ గా మారాయి. ఎయిర్ లైన్ సిబ్బందిని పేర్లతో సహా పిల్చేవాడు. వారంతా రోత్ స్టీన్ ను గుర్తు పట్టేవారు. అలా అమెరికన్ ఎయిర్ లైన్స్ రోత్ స్టీన్ రెండో ఇంటిలా మారిపోయింది.

చిన్న కుమార్తెను ఓసారి తనతో పాటు విమానాశ్రయం తీసుకెళ్లినప్పుడు.. దాన్ని తన ఆటస్థలంగా పరిచయం చేశాడు.

తనతో పాటే పలుమార్లు కుటుంబీకులను కూడా తీసుకెళ్లేవాడు. వీక్లీ ట్రిప్స్ ప్లాన్ చేసేవాడు. అలా ఖండాంతరాలన్నీ చుట్టేసింది రోత్ స్టీన్ ఫ్యామిలీ.

వెసులుబాటుకు బ్రేక్!

అమెరికన్ ఎయిర్ లైన్స్ తన సబ్సిడీలపై దృష్టి సారించింది. సంస్థ అలాగైతే లాభాల్లోకి రావడం లేదన్న భావనతో లైఫ్ టైం టిక్కెట్లను కూడా రద్దు చేసింది. దాంతో 2008, డిసెంబర్ 13వ తేదీన రోత్ స్టీన్ విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్ట్ కు అలా వస్తుండగానే… ఆయనకో సందేశం వచ్చింది. అది అతడి జీవితకాల అమెరికన్ ఎయిర్ లైన్స్ పాస్ రద్దు చేస్తున్నట్టు వచ్చిన మెస్సేజ్.

ఫ్రీ పాసులను ఉపయోగించేవారి ప్రయాణాల తీరుపైనా అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫోకస్ చేసింది. రోత్ స్టీన్ ఒప్పంద నిబంధనలనూ ఉల్లంఘించినట్టు తేల్చింది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఫలానా రోజు ఫలానా చోటకు ప్రయాణముంటుందన్న ఊహాత్మక బుకింగ్స్ తో సీట్లను రిజర్వ్ చేయడాన్ని తీవ్రంగా భావించింది. అందుకే, ఆయన లైఫ్ టైం పాస్ ను రద్దు చేస్తున్నట్టు సందేశాన్ని పంపింది.

రోత్ స్టీన్ ఏమంటాడు మరి..?

తను లైఫ్ టైం పాస్ కొనుగోలు చేసినప్పుడు కేవలం పాస్ తను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇంకెవ్వరికీ ఇవ్వకూడదనే నిబంధన తప్ప.. బుకింగ్స్ పై ఎలాంటి ఆంక్షలు లేకుండేనంటున్నాడు రోత్ స్టీన్. లైఫ్ టైం పాస్ కోల్పోవడం ఆర్థికంగా పెద్దగా నష్టంగా భావించడం లేదు. ఇప్పటికే తిరగాల్సిన దానికంటే ఎక్కువే తిరిగాను. కానీ, వ్యక్తిగతంగా బాధైతే కల్గిందంటున్నాడు రోత్ స్టీన్. వారు నా వ్యక్తిత్వంపై బురద జల్లారు. నేను అమెరికన్ ఎయిర్ లైన్స్ తో పెంచుకున్న ప్రేమను చంపేశారంటూ ఆరోపించాడు.

2009లో రోత్ స్టీన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ పై కేసు వేశాడు. కానీ, ఆ కేసు ఏళ్లపాటు కొనసాగి.. చివరకు అతడికి పాస్ తిరిగి ఇవ్వకుండా ఎయిర్ లైన్స్ కు మద్దతుగా తీర్పు వచ్చింది.

దాంతో రోత్ స్టీన్ కు ఎక్కడికంటే అక్కడికెళ్లి ఓ పక్షిలా ఎగిరి వెళ్లగల్గిన గత జ్ఞాపకాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. అలా స్వేచ్ఛగా ఎగిరిపోతున్న రోత్ స్టీన్ రెక్కలు కట్టేసినంత పని చేసింది అమెరికన్ ఎయిర్ లైన్స్. రోత్ స్టీన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ లైఫ్ టైం పాస్ కేవలం ఒక్క టిక్కెట్ మాత్రమే కాదు… తన స్వేచ్ఛకు అందివచ్చిన పాస్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles