సమస్య లోతునూ, బాధ బరువునూ పట్టిచూపిన ఫోటో!

ఒక్క ఫోటో వంద పదాలకు సమానమంటారు.. కొన్ని ఫోటోలైతే పదాల సంఖ్యతో కూడా పోల్చలేని స్థాయిలో విషాదాన్నీ మిగులుస్తాయి. ఘటనలు కాలగర్భంలో కలిసిపోయినా.. ఆ చరిత్రలను మన ముందుంచే ఫోటోలు కొన్ని ఉంటాయి. హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగి 80 ఏళ్లు దాటిన తరుణంలో అలాంటి ఓ ఫోటో కథ తెలుసుకుందాం.

అది 1945.. రెండో ప్రపంచ యుద్ధం. జపాన్ లోని హిరోషీమా-నాగసాకిపై కురిసిన బాంబుల వర్షానికి ఆ నగరాలు ఇప్పటికీ కోలుకోలేకుండా పోయి.. ఇప్పుడు హిరోషిమా, నాగసాకి ఓ డార్క్ టూరిజం డెస్టినేషన్స్ గా మారాయి. ఓ చేదు చరిత్రను మిగిల్చిన యుద్ధభూమికి సాక్షీభూతంగా నిల్చాయి. ఆ యుద్ధ సమయంలో అమెరికా పెన్సిల్వేనియాకు చెందిన ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్ జో ఓ డోనెల్ ను యూఎస్ మిలిటరీ అక్కడి యుద్ధభూమికి పంపింది. ఆయన వెళ్లి తీసిన ఫోటోలు… ఆయన్ని చిరకాలం ప్రపంచం మొత్తం మర్చిపోలేని ఫోటో జర్నలిస్ట్ గా గుర్తింపునిచ్చి నిలబెట్టాయి.

పదేళ్ల వయసున్న ఓ బాలుడు… తన వెనుకభాగంలో ఓ బిడ్డను మోస్తున్న ఫోటో అది. జపాన్లో ఆ రోజుల్లో.. పిల్లలు వారికంటే చిన్నవారిని వెనక్కి కట్టుకుని.. లేదా ముందు భాగంలో సంచీలాగా తగిలించుకుని ఆడుకునే దృశ్యాలు సర్వసాధారణం. అంతెందుకూ ఇప్పటికీ ప్రాశ్చాత్య దేశాలతో పాటు.. ఇప్పుడు మనదేశంలోనూ ఇలాంటి దృశ్యాలు విరివిగానే కనబడుతుంటాయి. అలాగే ఓ కుర్రాడు కూడా కాస్తా భిన్నంగా ఫోటో జర్నలిస్ట్ జో ఓ డోనెల్ కంట పడ్డాడు. కానీ, ఆ పిల్లాడు నిల్చున్న ప్రదేశం ఓ శ్మశానం. వచ్చిన తీరు ఆందోళనకరం. కాళ్లకు చెప్పుల్లేవ్.. బూట్లు లేవ్. ముఖమంతా నిండిన నిర్వేదం. తన వీపుకి నిద్రపోతున్నట్లుగా ఓ శిశువు తల సంచీలోంచి వేలాడుతూ కనిపిస్తోంది. అప్పటికి ఆ మరుభూమిలో ఓవైపు మారణహోమంలో అసువులు బాసినవారి ఖననాల ప్రక్రియ కొనసాగుతోంది. క్యూలైన్లలో చాలామంది నిల్చుని ఉన్నారు. వారిలో ఆ బాలుడొకడు. కానీ ఫోటో జర్నలిస్ట్ జో ఓ డోనెల్ కు మాత్రం ఏదో అనుమానం కొడుతోంది. ఇంకేం.. తన మూడో కన్నూ తెరుచుకుంది. అలా కెమెరాలో ఆ బాలుడు వెనక్కి తగిలించుకున్న సంచీలో నిద్రిస్తున్నాడా అన్నట్టున్న మరో బాలుడి ఫోటో బంధించాడు. కానీ అంతలోకే కాటికాపరులు రానే వచ్చారు. అసలే బాంబుల మోతలు.. చనిపోయినవారి బంధువుల హాహాకారాలతో పాటు.. చీకటి కూడా దట్టంగా అలుముకున్న సమయమది. ఆ కాపరులు మెల్లిగా బాలుడి వీపుకున్న సంచీ విప్పారు. అందులో విగతజీవైన ఆ శిశువును తీసి.. ఖననానికి సిద్ధం చేశారు. అప్పటికే తన కెమెరా కన్నుతో ఎన్నో ఫోటోలను సజీవ సాక్ష్యాల్లా పట్టి బంధించిన.. ఆ ఫోటో జర్నలిస్ట్ కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. ఇంకోవైపు.. ఆ యుద్ధంలో నా అన్నవాళ్లనందరినీ కోల్పోయి.. చివరాఖరకు తన సోదరుడి మృతదేహాన్ని కూడా కళ్లముందే ఖననం చేస్తుంటే.. కదలకుండా నిటారుగా నిశ్ఛేష్ఠంగా నిలబడ్డ ఆ బాలుడిలో.. కనిపించకుండా పోతున్న తన సోదరుడి రూపం.. చితి మంటలను మించిన ఆశ్రుమంటను నింపింది. కానీ ఎవ్వరికి చెప్పుకునేది.. ఆ సమయాన తన దుఖాన్ని ఎవరు తీర్చేది..? తన ఆవేదనంతా.. జస్ట్ శ్మశానరోదనే!

కానీ ఆ బాలుడు తన దుఖాన్ని ఆపుకోలేని సమయంలో అతడి ఆక్రోషం, ఆవేదన అంతా అతను తన పెదవిని గట్టిగా కొరుక్కుంటున్నప్పుడు వెల్లువెత్తిన రక్తంలో కనిపించిందంటాడు ఫోటో జర్నలిస్ట్ జో ఓ డోనెల్. అప్పుడక్కడే ఉన్న ఓ గార్డ్ ఆ బరువుని నాకియ్ నేను పట్టుకుంటానంటే.. అది బరువు కాదు నా తమ్ముడన్న ఆ సోదరుడి అవ్యాజమైన ప్రేమకు సాక్షీభూతమైంది ఆ సందర్భం. అందుకే జో ఓ డోనెల్ బంధించిన 1945 రెండో ప్రపంచ యుద్ధపు ఫోటో.. జపాన్ లో ఇప్పటికీ ధైర్యానికి చిహ్నంగా చూపిస్తుంటారు. నాటి రక్తచరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిల్చిన ఆ ఫోటో చూసి.. దాని గురించి తెలుసుకున్నవారందరికీ.. ఆ బాలుడి బాధ ముందు.. తమ బాధల బరువెంత. తమ సమస్య లోతెంత అనే ప్రశ్నలు ఇప్పటికీ ఉదయిస్తూనే ఉంటాయట.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles