తబలా మాస్ట్రోగా… అప్పడప్పుడూ తెరపై మెరిచిన ఆటవిడుపు సినిమా నటుడిగా… ప్రఖ్యాత కంపోజర్ గా జాకీర్ హుస్సేన్ సుపరిచితుడే. , ఆయన తబాలా ఎంత ఆకట్టుకుంటుందో… స్టైలిష్ ఐకాన్ గా ఆయన దిగిన ఫోటోలు అంతకంటే అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తాయి. ఇంతకీ ఆయన ఫోటోలను 43 ఏళ్ల పాటు షూట్ చేసిన ఆ ఫోటోగ్రాఫర్ ఎవరో తెలుసా..?
దయానితా సింగ్… భారతీయ ప్రముఖ ఛాయాచిత్రకారిణి..
గత ఏడాది 2024, డిసెంబర్ లో జాకీర్ హుస్సేన్ మృతితో దయానితా సింగ్ మళ్లీ తన ఫోటో ఆర్కైవ్స్ మెమరీస్ లోకి ఓసారి తొంగిచూశారు. అందులో జాకీర్ హుస్సేన్ తో కలిసి చేసిన ప్రాయణాలు, గ్రీన్ రూమ్ జ్ఞాపకాలు, ఆయన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలు ఇలా అన్నీ ఒక్కొక్కటికీ ఆమె మదిలో స్ఫురించాయి. వాటితో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు దయానితా సింగ్. జాకీర్ హుస్సేన్ – లెర్నింగ్ టూ లెర్న్ అని ఆ ఫోటో ప్రదర్శనకు నామకరణం చేశారు. తాను ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కేవలం ఫోటోల ప్రదర్శనగా చూడొద్దని.. యావత్ ముంబై జాకీర్ భాయ్ కి రాసిన ప్రేమలేఖలాంటిదన్నారామె.

జాకీర్ హుస్సేన్ బాల్యజీవితమంతా ముంబైతోనే ముడిపడింది. సెయింట్ మైఖేల్, సెయింట్ జేవియర్ పాఠశాలల్లో చదువుకున్నాడు. అక్కడే అతడి సంగీత ప్రయాణమూ మొదలైంది. దయానితా సింగ్ ఎగ్జిబిషన్ లో సుమారు 300 ఫోటోలు జాకీర్ హుస్సేన్ వి ప్రదర్శించింది.
40 ఏళ్ల పాటు జాకీర్ హుస్సేన్ తో దయానిత్ సింగ్ ప్రయాణం!
ప్రధానంగా తను తీసిన జాకీర్ హుస్సేనే ఫోటో ప్రదర్శనతో చెప్పాలనుకునది.. జీవితాంతం ఆయన ఎంత ఆనందంగా, జాలీగా, అంతే క్రమశిక్షణగా.. ఎప్పుడూ నేర్చుకునే నిత్య విద్యార్థిగా ఎలా ఉండగల్గాడన్నదే.
ఆయన్ను అభిమానించేవారికి, నేరుగా కలిసేవారికి, చివరకు వాహ్ తాజ్ యాడ్ లో చూసినవారినైనా సమ్మోహనపర్చే రూపం జాకీర్ హుస్సేన్. అందుకే ఆయన మరణం ఆయన్ని కలవని ఎందరో అభిమానుల్ని కూడా కలిచివేసింది.
తబలాపై ఆయన వేళ్లూ పురి విప్పి నాట్యమాడుతుంటే.. వీక్షకులు మరో లోకంలోకి ప్రయాణించాల్సిందే. తన చేతివేళ్లు చేసే మాయలో మునిగితేల్చే మాయ జాకీర్ భాయ్ ప్రత్యేకత.
2011లో జాకీర్ హుస్సేన్ తో దయానిత్ సింగ్ కు పరిచయం!
నాఫోటోగ్రఫీ చూసి 2011లో ఆయన నాకు మెస్సేజ్ చేశారు. వెనిస్ లో ఫోటో ఎగ్జిబిషన్ లో నీ పని చూడటం చాలా గర్వంగా ఉందన్నది ఆ సందేశం. దానికి నేను స్పందిస్తూ ఇప్పుడు నేను స్టార్ నే కదా అని రిప్లై ఇచ్చాను. నువ్వెప్పుడూ అలా అనుకోకూడదని నేను ఆశిస్తున్నానన్నది జాకీర్ హుస్సేన్ నుంచి నాకందిన ప్రతి సమాధానం. అప్పుడనిపించింది.. జాకీర్ ఉదార స్వభావి, సరాదా వ్యక్తే కాదు.. మనల్ని నేల విడిచి సాము చేయొద్దని చెప్పే ఓ గొప్ప గురువని.

జాకీర్ హుస్సేన్ ఫోటో ప్రదర్శన.. అత్యంత భావోద్వేగ క్షణం!
ముంబైలోని ది నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కళావేదికలో జాకీర్ హుస్సేన్ ఫోటో ప్రదర్శన ఉంటుందే.. తప్ప తబలాపై ఆయన చేసే ప్రదర్శన ఉండదనే భావన భావోద్వేగానికి గురిచేసింది. ఈ ఏడాది 2025, జనవరిలో ఆయనతో కలిసి కోల్ కత్తాలో ఆయనతో కలిసి ప్రదర్శనకు వెళ్లాల్సింది. అదే సమయంలో దాని తర్వాత ముంబై ఎన్సీపీఏలో జరిగే ఫోటో ఎగ్జిబిషన్ కు రావాలని నేను కూడా జాకీర్ హుస్సేన్ ను కోరాను. కానీ, ఆ ప్రదర్శనకు ముందే డిసెంబర్ 15వ తేదీ, 2024న ఆయన కన్నుమూయడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. జాకీర్ లేకుండా నేను ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మాట్లాడటమంటే నా వల్ల కాలేదు. కానీ, ఆయన వచ్చి నన్ను తట్టి లేపినట్టుగా… ముందుకు సాగని సూచించినట్టుగా అనిపించి ఆరోజు ఏకంగా 45 నిమిషాల పాటు నా అనుభవాలను, జాకీర్ తో ప్రయాణాన్ని చెప్పగల్గాను.

నేను ముందు ఫోటోగ్రాఫర్ నే కావచ్చు.. కానీ, ఆయన్నుంచి అంతకన్నా ఎక్కువ నేర్చుకున్నాను. బ్యాక్ స్టేజ్ క్షణాలను ఫోటోల్లో బంధించడం, గ్రీన్ రూమ్ లో కళాకారులు ఎలా సిద్ధమవుతారో క్యాప్చర్ చేయడం, కళాకారుల గౌరవాన్ని ఎలా కాపాడాలో ఇవన్నీ ఆయన్నుంచే నేర్చుకోగల్గాను. ప్రతీ ఏటా బస్సులు, కార్లలో రోడ్డు ప్రయాణాల్లో ఆయనతో కలిసి దేశమంతా తిరిగాను. వెస్ట్ బెంగాల్ నుంచి దక్షిణభారతం వరకూ… గుజరాత్, మహరాష్ట్ర దాకా… హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ శివకుమార్ శర్మ, గిరిజాదేవి వంటి దిగ్గజాలతో కలిసి ఆయన వెంట నడిచే అదృష్టం నాకు దక్కింది. మన దగ్గర ఉన్న కళను ప్రేక్షకుల దగ్గరకు చేయాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ నాకు నేర్పిన గురువు జాకీర్ హుస్సేన్ అంటోంది ఫోటోగ్రాఫర్ దయానితా సింగ్.
జాకీర్ ఫోటో ప్రదర్శనతో ఏం చెప్పాలనుకున్నారు దయానిత..?
జాకీర్ హుస్సేన్ గొప్ప సంగీతకారుడే కాదు, హాస్యప్రియుడు, మంత్రంలాంటి మనిషి. తన కెమెరాలో బంధించిన ఆ భావోద్వేగాలన్నీ ఫోటోల రూపంలో ఆయన అభిమానులకు మరోసారి చూపించాలన్నదే దయానిత తపన. దయానిత ఫోటో ప్రదర్శన జాకీర్ ను ఇంకా సజీవంగానే చూడాలనుకునేవారిని విభ్రమకు గురిచేసే ఎగ్జిబిషన్. ది నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కళావేదికలోని దిలీప్ పిరమిల్ ఆర్ట్ గ్యాలరీలో డిసెంబర్ 13న ప్రారంభమైన జాకీర్ హుస్సేన్ ఫోటో ప్రదర్శన.. 2026, ఫిబ్రవరి 3వ తేదీ వరకూ జరుగనుంది.
ప్రస్తుతం



